వాట్సాప్ కాల్స్‌తో జాగ్రత్త.. ఈ నెంబర్లతో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు.. !!

Published : May 09, 2023, 11:53 AM IST
వాట్సాప్ కాల్స్‌తో జాగ్రత్త.. ఈ నెంబర్లతో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు.. !!

సారాంశం

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా కూడా కాల్స్, మెసేజ్‌లు  చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. 

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా కూడా కాల్స్, మెసేజ్‌లు  చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గత పది రోజుల్లో ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి భారీగా వాట్సాప్ మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ వస్తున్నాయి. లోన్, లాటరీల పేరిట ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి వాట్సాప్‌కు మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇథియోపియా, మలేషియా, వియత్నాం వంటి దేశాల  ఐఎస్‌డీ కోడ్స్‌తో ఈ కాల్స్ వస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. 

అమ్మాయిలే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు ఈ కాల్స్ చేస్తున్నారు. +84564452481 నెంబర్‌తో ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వస్తున్న కాల్స్‌, మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని చెబుతున్నారు. 

అలాగే విదేశాల నుంచి వస్తున్న వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్‌లో ఈ కాల్‌లు లేదా మెసేజ్‌లకు ప్రతిస్పందిస్తే.. అవతలి వ్యక్తి ఏదో ఒక ఆఫర్ చూపి డబ్బు దోచుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు