తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారంనాడు విడుదల చేశారు. ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫరీక్ష ఫలితాలను tsbie.cgg.gov.in,examresults.ts.nic.in ,results.cgg.gov.in. వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు
ఈ ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కు చెందిన 9.5 లక్షల మంది విద్యార్దులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.85 శాతం, సెకండియర్ లో 67.26 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి చెప్పారు. ఇంటర్ ఫస్టియర్ లో అగ్రస్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది. ఇంటర్ సెకండియర్ లో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫస్టియర్ లో 56.80 శాతం మంది బాలురు ఉత్తీర్థులయ్యారు. బాలికలు68.85 శాతం మంది పాసయ్యారు. బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ లో లక్షా 73 వేల 61 మందికి ఏ గ్రేడ్ దక్కిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 54 వేల 776 మందికి బి గ్రేడ్ దక్కిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ సెకండియర్ లో 60.44 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ లో 73.46 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని మంత్రి చెప్పారు.
విద్యార్ధులపై ఒత్తిడి ఉండకూడదనే కారణంగా ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూన్ 4 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
also read:రేపే తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు: రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా.
ఇంటర్ విద్యార్ధుల కోసం టెలీ మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టుగా ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. 14416 నెంబర్ కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందాలని నవీన్ మిట్టల్ కోరారు. ఇవాళ సాయంత్రం నుండి ఇంటర్ మెమోలు ప్రింట్ తీసుకోవచ్చని నవీన్ మిట్టల్ తెలిపారు.