ఈ పోలీసు పులిరాజాను వదిలి పెట్టిర్రా? ... సిపి సాబ్

Published : Aug 18, 2017, 07:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఈ పోలీసు పులిరాజాను  వదిలి పెట్టిర్రా? ...  సిపి సాబ్

సారాంశం

తేలిపోయిన భూకబ్జా కేసు పులిని వదిలేసి మేకలు బలి సేఫ్ జోన్ లో పులేందర్ రెడ్డి  సిఐలు, ఎస్సైల మీద బదిలీ వేటు పులేందర్ ను వదలడంపై పోలీసు చర్చ

తెలంగాణలో ఆయన ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు గత పాలనా కాలంలో మంత్రిగా పనిచేసినాయన ఒక చుట్టం ఉండేటోడు. ఇక గత సర్కారు పాలనలో ఈ పోలీసు సారు రెచ్చిపోయి పుచ్చిపోయిండు. భూములు కబ్జా చేసిండు. బెదిరించి సంపాదించిండు. ఎక్కడ బడితే అక్కడ అందినకాడి కుమ్మిండు. దందాలు చేసిండు. సెటిల్ మెంట్లు చేసిండు. అట్లా కుమ్ముతుంటే ఎవరన్నా అడ్డు చెప్తే మంత్రి గారైన తన చుట్టం పేరు చెప్పి తప్పించుకునేవాడు. 

తీరా తెలంగాణ వచ్చింది. తెలంగాణలో కోరుకున్న టిఆర్ఎస్ సర్కారు వచ్చింది. ఫ్రెండ్లీ పోలిసింగ్ షురూ అయింది. కానీ ఆ అధికారి బుద్ధి మాత్రం మారలేదు. అవినీతి రహిత తెలంగాణ పాలనలోనూ తన బుద్ధి చూపుతూనే  ఉన్నడు. అందినకాడికి జంపుకుంటున్నడు. బిర్రుగ వెనకేసుకుంటున్నడు. అడ్డూ అదుపు లేకుండా కమాయిస్తుండు. ప్రస్తతం ఆయన పోస్టు అడిషనల్ డిసిసి. రాచకొండ కమిషనరేట్ లో.  ఆయన తన అక్రమార్జన విషయంలో సరిహద్దులు దాటిపోయిండు. ఆయన అండ చూసుకుని ఆయన కూతురు కూడా సెటిల్ మెంట్లు చేస్తున్నది. దందాలకు దిగి బాగానే ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక భూమి విషయంలో వివాదం నెలకొంటే పులి గారు తన వందిమాగదులను పురమాయించిర్రు. వారు అవతలి వారిని బెదిరింపులకు గురిచేసిన్రు. ఇది బూమరాంగ్ అయింది. పోలీసుల మీదనే కేసు కూడా నమోదు అయింది. 

ఇక పులిరాజా మీద టివిలల్ల, పేపర్ల నిండా వార్తలొచ్చినయ్. ఇక రేపో మాపో ఆయన మీద వేటు పడుడు ఖాయమనుకున్నరు. సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య సారు ఈ పులి పై సీరియస్ అయిండు. విచారణ కమిటీ వేసిండు. ఎసిపి రమణారావు విచారణాధికారిగా నియమించిండు. తీరా కమిటీ విచారణ జరిపింది. నివేదిక ఇచ్చింది. ఇక పులి బారిన పడ్డ వారంతా సంబరాలకు సిద్ధమైర్రు. రేపోమాపో పులి మీద వేటు పడడం ఖాయమనుకున్నరు. కానీ పులి సేఫ్ జోన్ లకు వెళ్లిపోయింది. ఉత్తుత్తి మేకల మీద వేటు పడింది. ఇదేంటబ్బా అని పులి బాధితులంతా బుర్ర గోక్కున్నరు. పులి తప్పేం లేదని విచారణలో తేల్చిపారేసిన్రు. రేపటి నుంచి చూసుకోరి ఆ ఆకలిగొన్న పులి బెబ్బులిలా విరుచుకుపడడం ఖాయమని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. 

పులేందర్ రెడ్డిని పక్కన పెట్టి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్సపెక్టర్లు, ముగ్గురు ఎస్సైల మీద బదిలీ వేటు పడింది. పులిందర్ రెడ్డికి నమ్మిన బంటులుగా, ఆయన చెప్పిన పని చేసినందుకు గాను రాయదుర్గం ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఎస్సై రాజశేఖర్ లను సిపి ఆఫీసుకు అటాచ్ చేసిర్రు. వీరిపై ల్యాండ్ సెటిల్ మెంట్ వ్యవహారంలో కేసు నమోదు అయింది. వీరి గురువు పులిందర్ రెడ్డి మీద కేసే లేకుండా పోయింది.

  • ఇదీ పులేందర్ రెడ్డి అక్రమాల చిట్టా...

పేరు.. పులిందర్‌రెడ్డి. గతంలో సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా విధులు నిర్వర్తించాడు. ఎల్‌బీనగర్‌ డివిజన్‌లో పనిచేసినప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. హాకర్స్‌, ఫుట్‌పాత్‌ వ్యాపారులు.. ఎవర్నీ వదలకుండా ముక్కు పిండి మరీ తనకు కావాల్సింది దండుకునేవాడనే పేరుంది. వసూళ్ల కోసం ఏకంగా ఓ హోంగార్డునే కేటాయించినట్టు సదరు అధికారిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. బాధితుల గోడుతో అప్పటి పోలీసు కమిషనర్‌ సీవీ. ఆనంద్‌ ఇతడిపై విచారణ జరిపి డీజీ కార్యాలయానికి ఎటాచ్‌ చేశారు. దాదాపు 10 నెలల వరకూ ప్రభుత్వం పులేందర్‌రెడ్డికి పోస్టు కేటాయించలేదు. ఇటీవలే కార్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అడిషనల్‌ డీసీపీ హోదాలో పోస్టింగ్‌ వచ్చింది. అధికారం చేతికి అందగానే మళ్లీ తన నిజరూపం ప్రదర్శించాడు. తనతో పాటు.. మరో ముగ్గురు పోలీసు అధికారులను పంచాయితీలోకి లాగాడు.

 

  • కేసు దాకా వెళ్లింది దీని మీదే...

గచ్చిబౌలిలోని ఎన్‌సీసీ పరిధిలో పులేందర్‌రెడ్డి కూతురు కీర్తి ఐశ్వర్యారెడ్డి నివాసముంటోంది. తండ్రి అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంగా రెడ్డి జిల్లా ముత్తంగి వద్ద రెండెకరాల ఏడు గుంటల భూమి అమ్మకానికి ఉన్నట్టు గుర్తించింది. భూమికి హక్కుదారులుగా ఉన్న అబూబకర్‌ అతడి సహచరులతో బేరసారాలు సాగించిన అనంతరం కోటి పది లక్షల రూపాయలకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. రూ.5 లక్షలు వారికిచ్చిన కీర్తి మిగిలిన సొమ్ము 45 రోజులకు తిరి గిచ్చేలా గడువు కోరింది. గడువు దగ్గరవుతున్న సమ యంలో అబూబకర్‌ మిగిలిన సొమ్ము కోసం ఆమె చుట్టూ తిరిగాడు. ఈ నేపథ్యంలో మరో రియల్‌ వ్యాపారి అదే ధరకు భూమిని కొనేందుకు రావటంతో అబూబకర్‌ బృందం దాన్ని వారికి విక్రయించింది. అబూ బకర్‌ ఎక్కువ ధరకు భూమిని అమ్మి లాభం గడించినట్టు కీర్తి ఐశ్వర్యారెడ్డి భావించింది. లాభంలో వాటా కావా లంటూ డిమాండ్‌ చేసినట్టు సమాచారం. దానికి అతడి నుంచి సమాధానం రాకపోవటంతో విషయాన్ని తండ్రి పులేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది.

భూమి ఉన్నది సంగారెడ్డిలో.. కీర్తి ఐశ్వర్యారెడ్డి నివాసం నార్సింగ్‌ ఠాణా పరిధి.. కానీ రంగంలోకి దిగిన పులేందర్‌రెడ్డి ఇవేమీ పట్టించుకోలేదు. గతంలో తనకున్న పరి చయంతో రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌కు హుకుం జారీచేశాడు. ఎలాగైనా సరే డీల్‌ ఓకే చేయమని ఆర్డరేశాడు. తన పై అధికారి.. ఏదైనా జరిగితే తానే చూసుకుంటాడనే ఉద్దేశంతో ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ సరే నన్నాడు. కీర్తి ఐశ్వర్యారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జూలై 25న కేసు నమోదుచేశారు. ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీ నారాయణతో కలసి జూలై 26న ఉదయం నార్సింగ్‌లోని అబూబకర్‌ ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఠాణాకు రమ్మని ఆదేశించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఠాణాకు వచ్చిన అబూబకర్‌, అహ్మద్‌లను రాత్రి 10 గంటల వరకూ అక్కడే కూర్చోబెట్టారు. బెదిరింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. నష్టపరిహారం కింద రూ.60 లక్షలకు ఖాళీ చెక్‌లపై సంతకాలు చేయించుకున్నారు. అతడి వద్ద ఉన్న రూ.49 వేల నగదు ఇన్‌స్పెక్టర్‌ తీసుకున్నట్టు సమాచారం. దీనిపై బాధితుడు సైబరాబాద్‌ సీపీ సందీప్‌శాండిల్యను కలిసినట్టు తెలియగానే పులేందర్‌రెడ్డి ఖాళీ చెక్‌లను బాధితుడు అబూబకర్‌కు అందజేశాడు. 

మొత్తానికి పులిని వదిలేసి మేకలను బలి ఇచ్చారు పోలీసు బాసులు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే