తెలంగాణ డిఎస్సీ పై మరో కొత్త జోక్

Published : Aug 18, 2017, 04:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తెలంగాణ డిఎస్సీ పై మరో కొత్త జోక్

సారాంశం

తెలంగాణ సర్కారు తీరుపై జోక్స్ తో నిరసన తాజా డిఎస్సీ ప్రకటనలపై కొత్త జోక్ హల్ చల్  

తెలంగాణ సర్కారు కొలువెక్కి మూడేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు కెసిఆర్ సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. డిఎస్సీ పేరుతో ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నారని మండిపడుతున్నారు నిరుద్యోగులు. త్వరలో డిఎస్సీ అని, అప్పుడు డిఎస్సీ, ఇప్పుడు డిఎస్సీ అని పూటకో మాట, రోజుకో ప్రకటనతో సర్కారు పెద్దలు కాలమెల్లదీస్తున్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా, చివాట్లు పెట్టినా సరే సర్కారు మాత్రం టీచర్ ఉద్యోగాల భర్తీపై ఎందుకో ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేస్తున్నట్లు కనబడుతున్నది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు డిఎస్సీపై రకరకాల కవితలు, పాటలు, జోకులు వేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో అవి వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సర్కారు డిఎస్సీపై తాజాగా హడావిడి చేస్తుండడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు కొత్త సెటైర్ ను సోషల్ మీడియాలోకి వదిలారు. అది ఇదే.

డీఎస్సి కొత్త జిల్లాల ప్రకారమా పాత జిల్లాల ప్రకారమా తర్జన భర్జన పడనికి 20 రోజులు అంటే సెప్టెంబర్ వస్తది సెప్టెంబర్ లో తర్జన భర్జన పూర్తి అయి కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సి అని ప్రకటించి దసరా కానుకగా డీఎస్సి నోటిఫికేషన్ ఆ వెంటనే ఇంకా గెజిట్ రాని కొత్త జిల్లాల ప్రకారం నువ్ పోస్టులు ఎట్లా భర్తీ చేస్తావ్ అని మిత్రులు కోర్టుకి వెళతారు కోర్టు పిటిషన్ స్వీకరించి పరీక్ష జరపద్దని స్టే ఇవ్వడం ఆ వెంటనే నమస్తే తెలంగాణ టివిలలో నిరుద్యోగులను దునుమాడుతూ ఉద్యోగాలు కావాలని అంటారు ఉద్యోగాలిస్తే కోర్టులో కేసులు వేస్తారని ఒక వారం పాటు ప్రచారం చేస్తారు.

టీఎస్పిఎస్సి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి డీఎస్సి అంశం కోర్టులో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నామని ప్రకటిస్తది.నవంబర్ లో కోర్టు కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సి పరీక్ష నిర్వహించొద్దని అదేశాలిస్తది.టీఎస్పీఎస్సి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి త్వరలో మళ్ళీ పాత జిల్లాల ప్రకారమే డీఎస్సి వేస్తామని ప్రకటిస్తది.

ఇక విద్యా శాఖ పాత జిల్లాల ప్రకారం డీఎస్సి నిర్వహించడానికి మల్లోక సారి కొత్త నిబంధనలు ప్రాకృత పైశాచిక భాష లో తయారు చేస్తున్నామని డిసెంబర్ దాకా కాలయపన చేస్తది.మధ్య మధ్యలో పాపం నిరుద్యోగులను సల్లబరచడానికి టి న్యూస్ నమస్తే తెలంగాణ త్వరలో డీఎస్సి త్వరలో డీఎస్సి అని ప్రకటనలు చేస్తూ సర్కస్ ఫీట్లు చేస్తది అవి చదివి మన నిరుద్యోగులు మరింత అప్పులు తెచ్చుకుని అవనిగడ్డకు ఉరుకుడు నోటిఫికేషన్లు రాకపోయేసరికి తెల్ల మొహం వేసుకుని ఇంటికచ్చుడు, అయ్యా అవ్వ తిట్టంగానే ఏమన్నా పనిలో జాయిన్ అవ్వగానే 2018 నూతన సంవత్సర కానుకగా డీఎస్సి ప్రకటన రావడం మల్లి నిరుద్యోగులు చేస్తున్న పనులు వదిలేసి మళ్ళీ అవనిగడ్డకు ఉరకి బకర అవడం.

ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహణ పూర్తి అయి మార్చి చివరన ప్రాధమిక కీ విడుదల ఏప్రిల్ చివరన ఫైనల్ కీ విడుదల మే నెలలో ఫలితాలు విడుదల.జూన్ 2 న గంటా చక్రపాణి గర్వంగా అభ్యర్థులకు నియకమక పత్రాలు అందజేయడం.ఇది డీఎస్సి ప్రాసెస్ ఒక నెల అటు ఇటు నేను చెప్పినట్టు జరగకపోతే చూడండి.....

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌