కెటిఆర్ కు ఆ అనుమానం ఎందుకొచ్చింది?

First Published Apr 18, 2017, 9:21 AM IST
Highlights

"హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లరని ఎందుకు కెటిఆర్ వివరణ ఇచ్చారో నాకు తెలియదు"

తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు  కాంగ్రెస్ కు వెళ్లడు అని ఐటి మంత్రి కేటీ రామారావు  అనడం పట్ల కాంగ్రెస్ జగిత్యాల శాసన సభ్యుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

అలా కెటిఆర్ బహిరంగంగా ఎందుకు అంటున్నారో ..ఆయనకు హరీష్ రావు మీద ఎందుకు అనుమానం వచ్చిందో తనకు తెలియదని జీవన్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.

నిన్న జగిత్యాలలో మాట్లాడుతూ కెటిఆర్  తన బావ, తోటి మంత్రి హరీష్  గురించి మాట్లాడుతూ ‘హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లడు’ అని అన్నారు.

ఈ విషయం మీద ఈ రోజు ప్రశ్నించినపుడు  జీవన్ రెడ్డి స్పందించారు.

‘హరీష్ రావు  కాంగ్రెస్ కి వస్తాడో...రాడో...అవన్నీ నాకెందుకు?’ అని ఆయన అన్నారు.

 హరీష్ రావు మీద ఎందుకు అనుమానం వచ్చిందో కెటిఆర్ చెప్పాలని అభిప్రాయపడ్డారు.

జగిత్యాల సభలో కెటిఆర్ జీవన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. దీనికి జవాబిస్తూ

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ను ఉప్పుపాతర పెడతారా? అని ప్రశ్నించారు.

కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శిస్తూ,‘ నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ కాదా?

కేసీఆర్ కంటే ముందే నేను ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను. 1999లో మంత్రి అయి ఉంటే కేసీఆర్ పార్టీ పెట్టేవాడా?

ఎన్టీఆర్ ను దించే క్రమంలో కేసీఆర్ చంద్రబాబుకు తాబేదారుగా వ్యవహరించలేదా?1995-99 మధ్య కేసీఆర్ ఏనాడూ తెలంగాణ ప్రస్తావన తేలేదు,’ అని జీవన్ రెడ్డి అన్నారు.

ఇపుడుతెలంగాణా లో సాగుతున్నజనహిత సభలు కేవలం

కేటీఆర్ ను ప్రమోట్ చేయడం కోసం ఉద్దేశించినవే నని జీవన్ రెడ్డి అన్నారు.

 

అంబేద్కర్ జయంతి నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ పత్తా లేకపోవడంమీద తీవ్రంగా స్పందిస్తూ

అంబేద్కర్ జయంతి, వర్థంతికి విగ్రహానికి దండవేయని దౌర్భాగ్యుడు ఎక్కడా ఉండడని  జీవన్ రెడ్డి తన సహజ శైలి లో వ్యాఖ్యానించారు.

click me!