
ఇపుడు తెలంగాణాలో జరుగుతున్న జనహిత సభలకు చాలా రాజకీయ ప్రాముఖ్యం వున్నట్లనిపిస్తుంది.
ఈ సభలు ఐటి , మునిసిపల్ మంత్రి కెటి రామారావుని ఒక కొత్త రాజకీయ నాయకుడిగా, తెలంగాణా భవిష్యత్తుగా పరిచయం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆయన టిఆర్ ఎస్ కార్యకర్తలు నీరాజనాలు పడుతున్నారు. ఒకొక్కచోట కెటిఆర్ ఒక్క విశేషం వెల్లడిస్తున్నారు. ఆయన హావభావాలు, ఆయన భాష, హమీలు చూస్తే, ఈయన తొందర్లోనే ముఖ్యమంత్రి అయిపోతున్నారని, దానికి భూమిక తయారుచసేందుకే జన హిత సభలు నిర్వహిస్తున్నారని అనిపిస్తుంది. గత వారంలో జరిగిన నిజాంబాద్ ఆర్మూర్ పట్టణ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, మాజీ కాంగ్రెస్ నేత, ఇపుడు టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యడు డిశ్రీనవాస్ దాకా, పొగిడిన తీరు చూస్తే కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతున్నట్లు వారి తెలిసిందేమో అనిపిస్తుంది. ఆర్మూర్ వీధులగుండా జరిగిన వూరేగింపు,సాధారణ కొత్త గా ఒకపార్టీ సభకు వచ్చిన మంత్రికి అంత వైభవంగా స్వాగతం చెప్పడం సాధ్యం కాదు. రాజకీయాలలో ప్రతి కదలిక అర్థముంటుంది. ఆర్మూర్ సభ, కొత్తగా ముఖ్యమంత్రి అయి వచ్చిన రామన్న కు స్వాగతం పిలికినట్లుంది.ఇదే సందడి జగిత్యాలలో కూడా. ఆయన మీద పూలవాన కురిపించారు. పోయిు, ఎన్నికలను జయించుకురండి, అని ముఖ్యమంత్రి కెసిఆర్ , కుమారుడు కెటిఆర్, కూతరు కవితను పురమాయించినట్లనిపిస్తుంది, ఈ హంగామా చూస్తే.
ఇక కెటిఆర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్లుగా నే స్పందిస్తున్నారు. ప్రజలకు హామీలిస్తున్నారు. వరాలిస్తున్నారు. కాంగ్రెస్ ను ఎన్నికల సభల్లో లాగా చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్ నేత పరువుతీస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి ఎన్నికలపుడే చూస్తుంటాం.
నిన్నజగిత్యాలలో జరిగిన జనహిత సభలో అనేక ఆసక్తికరమయిన విషయాలను సూచన ప్రాయంగా కెటిఆర్ వెల్లడించారు. ఇందులో ఒకటి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరడనేది. రెండవది ఎన్నికలకు సంబంధించింది.
‘ఎన్నికలు ఎపుడజరిగినా ప్రజలు టిఆర్ ఎస్ కు అండగా వుండాలి. ఎన్నికలెపుడు జరిగినా ఎదుర్కొనేందుకు టిఆర్ ఎస్ సిద్ధం,’ అనేది ఆయన చెప్పిన మరొక మాట. ఈ విషయాన్ని విలేకరుతో మాట్లాడుతూ చెప్పారు.
తెలంగాణా, ఆంధ్ర ముఖ్యమంత్రులిద్దరు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రధాని మోదీకి అంగీకారం తెలిపారని చాలా రోజులుగా వినవస్తున్న మాట. ముందస్తు ఎన్నికలు వుండనే వుండవని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నా ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇపుడు 12 శాతం మైనారిటీ రిజర్వేషన్లు, 10శాతం ఎస్ టి రిజర్వేషన్లు అన్నీకూడా ఎన్నికల ముందు ఫీల్ గుడ్ వాతావరణం కల్గించేందుకే నని అంతా అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఎన్నికలెపుడొచ్చినా టిఆర్ ఎస్ సిద్ధం అనడం లో ఎన్నికలకు టిఆర్ ఎస్ సమాయత్తమవుతు ఉందనేదే రహస్యమనిపిస్తుంది.
జనహిత సభలన్నీ ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేసేందుకే అనే అనుమానం కూడా ప్రతిపక్ష పార్టీలలో మొదలయింది.
‘ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ప్లానేమీ లేదు మాకు. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు మేం సిద్ధం, ’ అనేది ఆయన జగిత్యాల సందేశం.