కేసీఆర్ ముహుర్తం వెనుక ఆంతర్యమిదే

By narsimha lodeFirst Published Dec 12, 2018, 4:43 PM IST
Highlights

 తెలంగాణ సీఎంగా  రెండోసారి  బుధవారం నాడు ప్రమాణం చేయనున్నారు


హైదరాబాద్: తెలంగాణ సీఎంగా  రెండోసారి  బుధవారం నాడు ప్రమాణం చేయనున్నారు. బుధవారం నాడు షష్టిపంచమి.  ఈ రోజు సీఎంగా ప్రమాణం చేస్తే  చాలా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు  కేసీఆర్ కు సూచించారు.

ఏ పనిని చేపట్టాలన్నా కేసీఆర్ ముహుర్తాన్ని కేసీఆర్ చూసుకొంటారు. కేసీఆర్ సూచనల మేరకు జ్యోతిష్య పండితులు సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే  ముహుర్తాన్ని నిర్ణయించారు.

డిసెంబర్ 13వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. సీఎంతో పాటు ఒక్కరు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తారు.

ప్రముఖ జ్యోతిష్య పండితులు గోపికృష్ణ కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసే ముహుర్తాన్ని నిర్ణయించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయడానికి  ఎంచుకొన్న ముహుర్త బలం చాలా గొప్పదని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు రేపు, ఎల్లుండి ముహుర్త బలాల గురించి జ్యోతిష్య పండితులు వివరించారు.ఆయా ముహుర్త బలాలకు సంబంధించి కేసీఆర్ కు తెలిపారు.
డిసెంబర్ 13వ తేదీ సుబ్రమణ్య షష్టి. సుబ్రమణ్యస్వామి తారక సంహరం చేసిన రోజు. దేవతలకు పట్టాభిషేకం చేసిన రోజు. ఆ రోజున కేసీఆర్ ప్రమాణం చేయడం కేసీఆర్ కు కలిసొచ్చే అంశంగా  జ్యోతిష్య పండితులు తెలిపారు.

జ్యోతిష్య పండితుల సూచన మేరకు సీఎం ప్రమాణం చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు మంచి ముహుర్తం ఉందని జ్యోతిష్య పండితులు చెప్పారు. ఈ సూచన మేరకు  కేసీఆర్ డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 1:10 గంటలకు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీలో కాలు పెట్టడం ఖాయం: కేసీఆర్

ఇతర పార్టీల కీలకనేతలు మా వైపు వస్తారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు

click me!