అన్నయ్య ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ అవుతారు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By Arun Kumar PFirst Published Dec 12, 2018, 3:59 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీ నాయకులు టీఆర్ఎస్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన విషయం  తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నల్గొండ జిల్లాలో కూడా కారు జోరు కొనసాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితమయ్యింది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి ఫోటీచేసి ఓడిపోగా... ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నుండి పోటీ చేసి గెలుపొందారు.  
 
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... వెంకట్ రెడ్డి ఓటమిని నల్గొండ ప్రజలు కూడా అంగీకరించడం లేదని...అందువల్లే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ గెలిచినందుకు ఎటువంటి సంబరాలు చేసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే కాకపోతే ఏమయ్యింది...త్వరతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిగా పోటీ చేసి వెంకట్ రెడ్డి గెలుపొందడం ఖాయమంటూ రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య గెలుపొందడం ఎంతో ఆనందంగా  ఉందన్నారు. తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు లింగయ్య ను గెలిపించిన నకిరేకల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తీర్పును అనుసరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా సమర్థవంతంగా పనిచేస్తామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.    

click me!