ఇద్దరు స్నేహితులకు ఒకే ప్రియురాలు.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని ఓ యువకుడు ఏం చేశాడంటే ?

Published : Jul 21, 2023, 08:23 AM IST
ఇద్దరు స్నేహితులకు ఒకే ప్రియురాలు.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని ఓ యువకుడు ఏం చేశాడంటే ?

సారాంశం

ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. అయితే అందులో ఒకరితో ఆ అమ్మాయి చనువుగా ఉంటోంది. దీనిని ఓ మరొకరు తట్టుకోలేపోయాడు. దీంతో ఆ స్నేహితుడిని మరి కొందరితో కలిసి హతమార్చాడు. 

ఆ ఇద్దరు యువకులు స్నేహితులు. ఒకే యువతిని ప్రేమించారు. అయితే హఠాత్తుగా ఇద్దరు స్నేహితుల్లో ఒకరు అదృశ్యమయ్యారు. ఈ విషయంపై పోలీసుకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేప్టటిన పోలీసులు.. కనిపించకుండా పోయిన యువకుడు హత్యకు గురయ్యాడని గుర్తించారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో మరో స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని నిర్దారించారు. 

సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సినీ నటికి ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్ ఆఫర్.. హోటల్ కు వెళ్లగానే అత్యాచారం..

రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మున్సిపాలిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల కిందట తెలంగాణకు వలస వచ్చాడు. అలాగే 21 ఏళ్ల రాహుల్ సింగ్ అలియాస్ అమర్ నాథ్ కూడా తన కుటుంబంతో కలిసి అదే రాష్ట్రం నుంచి ఇక్కడి వలస వచ్చాడు. వీరిద్దరూ స్నేహితులు. కొత్తూరులో నివసిస్తున్నారు. ఇందులో రాజ్ కపిల్ సాహూ తిమ్మాపూర్ లోని హెచ్ఐఎల్ పరిశ్రమలో పని చేస్తున్నాడు.

ఈ ఇద్దరు స్నేహితులు అదే రాష్ట్రం నుంచి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న ఓ యువతిని ఇష్టపడ్డారు. ఆమెను ప్రేమించారు. కొంత కాలం నుంచి ఆ అమ్మాయి రాజ్ కపిల్ తో చనువుగా ఉంటోంది. దీనిని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో తన స్నేహితుడిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. దీనికి వీరు నివసించే ప్రాంతమైన కొత్తూరులో ఉండే పాత నేరస్తుడు 19 ఏళ్ల మహమ్మద్‌ తాహేర్‌, అలాగే మరో ఇద్దరు మైనర్ ల సాయం తీసుకున్నాడు.

జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

వీరంతా కలిసి ఈ నెల 18వ తేదీన సాయంత్రం సమయంలో రాజ్ కపిల్ తో కలిసి మద్యం సేవించాలని అనుకున్నారు. అందులో భాగంగానే అతడిని తిమ్మాపూర్ దగ్గరలో ఉన్న ఓ పాత వెంచర్ దగ్గరకు పట్టుకొని వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి మద్యం తాగారు. తరువాత బీరు సీసాలను పగులగొట్టి, వాటితో పొడిచారు. అలాగే అక్కడి బండరాయితో తలపై మోదారు. దీంతో రాజ్ కపిల్ సాహు చనిపోయాడు. తరువాత డెడ్ బాడీపై కొంత మట్టికప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు.. ఈ సారి ఎన్నిరోజులంటే..?

అయితే రాజ్ కపిల్ కనిపించకపోవడంతో హెచ్‌ఐఎల్‌ పరిశ్రమ కాంట్రాక్టర్‌ సోనూకుమార్‌ ఆందోళన చెందాడు. మరుసటి రోజు అంటే జూలై 19వ తేదీన ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించాడు. వారికి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా రాజ్ కపిల్ గదిలో ఉండే ఓ వ్యక్తిని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో రాహుల్ సింగ్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. దీంతో తానే నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడితో పాటు ఈ హత్యలో ప్రమేయం ఉన్న మిగితా నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామని
శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రాంచందర్‌రావు మీడియాతో గురువారం తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్