
హైదరాబాద్ : బరువు తగ్గిస్తారనుకుంటే..Shock treatment ఇచ్చి మోసగించారని uppal కు చెందిన బాధితురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుకు ప్రతివాద kolors సంస్థ స్పందించకపోవడంతో సేవల్లో లోపంగా పరిగణిస్తూ కమిషన్ fine విధించింది. వివరాల్లోకి వెడితే... పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ తన కూతురు weight loss చికిత్స కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని కలర్స్ సంస్థను ఆశ్రయించారు.
సహజ పద్ధతిలో చికిత్స అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలుపగా ఆమె తన కుమార్తెను బరువు తగ్గే చికిత్స కోసం చేర్పించారు. ముప్పై ఐదువేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ డబ్బును రెండు దఫాలుగా గత ఏడాది ఏప్రిల్లో చెల్లించారు. మూడు సిట్టింగ్ ల చికిత్సలో భాగంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో 76.3 కిలోల బరువు ఉన్న తన కూతురు మరో రెండు కిలోలు అదనంగా పెరిగిందని ఆరోపించారు.
ఛాతి నొప్పితో బాధపడుతుండటంతో చికిత్స ఆపేసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. అందుకు కలర్స్ సంస్థ అంగీకరించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఫిర్యాదుదారు చెల్లించిన రూ. 35,000, 6 శాతం వడ్డీతో, పరిహారంగా రూ. 5,000, కేసు ఖర్చులకు రూ. 2000 చెల్లించాలని.. 45 రోజుల గడువులోగా ఈ డబ్బు చెల్లించకపోతే తొమ్మిది శాతం వడ్డీ కట్టాలి అని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, సేవల్లో లోపంతో భారీ జరిమానా విధించిన ఘటన జనవరి 29న బెంగళూరులో ఒకటి వెలుగులోకి వచ్చింది. పీకో, ఫాల్స్ కుట్టమని చీర ఇస్తే ఓ టైలర్ కాల్చేసింది. దీంతో ఓ జంట tailor మీద case పెట్టింది. Consumer Forumని ఆశ్రయించింది. court దంపతులకు ఊరటనిస్తూ ఖరీదైన చీర విలువను కట్టియ్యాల్సిందిగా స్థానిక టైలర్ ను ఆదేశించింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు కోర్టులో పోరాటం కొనసాగిన తర్వాత, bengaluru వినియోగదారుల ఫోరం ఇటీవల ఈ జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దంపతులకు జరిగిన ఇబ్బందులకు గాను రూ.10,000 పరిహారం, దీంతోపాటు చీర ధర (రూ. 21,975) వాపసు ఇవ్వాలని టైలర్ ని కోర్టు ఆదేశించింది.
వివరాల్లోకి వెడితే... ఆగష్టు 18, 2019న, GKVKలోని జ్యుడిషియల్ లేఅవుట్ లో ఉండే 65 ఏళ్ల మంగళా ఇవానికి ఆమె భర్త 75 ఏళ్ల ఇవానీ మైసూర్ సిల్క్ చీరను కొన్నాడు. వారు దాన్ని షోరూమ్ నుండి కొనుగోలు చేశారు. అక్టోబరు 29, 2019న, మంగళ, ఆమె కుమార్తె తమ ఇంటి పక్కనుండే బొటిక్ కు వెళ్లారు. దీన్ని నడిపే దివ్య అనే మహిళకు ఆ చీరకు ఫాల్స్ కుట్టడంతో పాటు మరికొన్ని బట్టలు ఆల్ట్రేషన్ చేయడానికి ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో టైలరింగ్/స్టిచింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని దివ్య హామీ ఇచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసిన దివ్య.. చీర కొన్ని చోట్ల కాలిపోయిందని మంగళకు చెప్పింది. దీంతో ఖంగుతిన్న మంగళ.. తన కొత్త పట్టు చీర బొటిక్ లోనే పాడైందని, కాబట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే దీనిమీద దివ్య ఏమీ మాట్లాడలేదు.
దీంతో దివ్యనుంచి 50 రోజుల వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో విసుగెత్తిన మంగళ దివ్య బొటిక్ సర్వీసులో లోపం ఉందని.. తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపారు. అలాగే ఈ మేరకు ఇద్దరూ శాంతినగర్‌లోని బెంగళూరు రూరల్, అర్బన్ 1వ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించారు. జనవరి 18, 2020న ప్రారంభమైన వ్యాజ్యంలో, కస్టమర్‌లు తమ వాదనలను న్యాయవాది ద్వారా సమర్పించగా, దివ్య తన న్యాయవాది ద్వారా వాదించుకుంది.
కస్టమర్ తనకు పాత చీర ఇచ్చారని, గతంలో ఇస్త్రీ సమయంలో చీర కాలిపోయిందని, ఆ నష్టానికి తననే తప్పుబడుతున్నారని దివ్య ఫిర్యాదు చేసింది. తన బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా చీరను తీసుకునే ముందు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంలో విఫలమయ్యానని దివ్య తెలిపింది.
చీర తీసుకునే ముందు.. పరిశీలించి ఉండాల్సింది...
దాదాపు 24 నెలల పాటు కొనసాగిన విచారణలో, బెంగళూరు వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తులు, దివ్య పట్టుచీరను ఫాల్స్ కుట్టుడానికి తీసుకునే ముందు దానిని పరిశీలించాల్సిన బాధ్యత ఆమెకు ఉందని, ఆ పని చేయకుండా, పని ఒత్తిడితో గమనించలేదని ముందుగానే పాడైందని పేర్కొంటూ బాధ్యతా రహితంగా తప్పించుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని చెప్పుకొచ్చారు.
జనవరి 13, 2022న దీనిమీద వెలువరించిన తీర్పులో, దర్జీకి సంబంధించిన చీర విలువ (రూ. 21,975), రూ. 5,000 నష్టపరిహారంగా, మరో రూ. 5,000 కస్టమర్ల కోర్టు ఖర్చులకు చెల్లించాలని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.