
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (congress), టీఆర్ఎస్ (trs) నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిరసనలకు సైతం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (ktr) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వుందా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో నరేంద్ర మోడీ (narendra modi) రాజ్యాంగం నడుస్తోందని.. తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారమే ఏర్పడిందని కేటీఆర్ గుర్తుచేశారు.
రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని.. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ను సీఎం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చిందని మంత్రి చెప్పారు. సీఎంకు , గవర్నర్ వ్యవస్థకు మధ్య అగాధాన్ని తెచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్తే.. కర్ణాటకలో బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా మీరు కోరుకున్న భారతదేశం.. విద్యార్ధుల మనసులో మతం పేరుతో విషం నింపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి చలికాచుకోవాలనేది బీజేపీ ప్రయత్నమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు.