ఆ పొరపాటు జరగనివ్వం: పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్

By narsimha lodeFirst Published Oct 8, 2020, 2:24 PM IST
Highlights

 గత ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగిందని... ఇప్పుడు అది జరగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

దుబ్బాక: గత ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగిందని... ఇప్పుడు అది జరగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

గురువారం  నాడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడమే తన లక్ష్యమన్నారు.

also read:రఘునందన్ రావుపై రేపిస్టు వ్యాఖ్యలు: ఆ కథాకమామిషు ఇదీ...

రెండో స్థానం కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిర్ణయించిన తర్వాత నియోజకవర్గంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు.

also read:సుజాతకు టికెట్: కాంగ్రెస్‌లోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

రాయపోల్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని టీఆర్ఎస్ కు ఓటు అడిగే అర్హత లేదన్నారు ఉత్తమ్. పేదలకు ఇళ్లు కట్టకున్నా కేసీఆర్ మాత్రం కోట్లతో తన క్యాంప్ ఆఫీసును కట్టుకొన్నాడన్నారు.రైతు వ్యతిరేక విధానలను అవలంభిస్తున్న బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ఉత్తమ్.  

నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించింది.

click me!