హైద్రాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ మెరుపు ఆందోళన: ఉద్రిక్తత

Published : Oct 08, 2020, 12:21 PM IST
హైద్రాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ మెరుపు ఆందోళన: ఉద్రిక్తత

సారాంశం

హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ  హైద్రాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.


హైదరాబాద్: హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ  హైద్రాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రంలో రోజు రోజుకి హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఇవాళ ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో హోం మంత్రి ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు.బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో మంత్రుల నివాసాల్లోని మెయిన్ గేట్ ను తోసుకొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. ఊహించని పరిణామంతో సెక్యూరిటీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. 

వందలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా మంత్రుల నివాసాల వైపుకు దూసుకువెళ్లడంతో  సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించేందుకు  ప్రయత్నించేందకు విపలయత్నం చేశారు. హోంమంత్రి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?