గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

By narsimha lodeFirst Published Nov 11, 2018, 8:29 PM IST
Highlights

ఈ నెల 15 వతేదీ నుండి  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  రోజుకూ మూడు లేదా నాలుగు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 

హైదరాబాద్: ఈ నెల 15 వతేదీ నుండి  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  రోజుకూ మూడు లేదా నాలుగు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో అద్భుత విజయాన్ని సాధిస్తామని కేసీఆర్ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. మేడ్చల్ నుండి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని బరిలోకి దింపే అవకాశం కన్పిస్తోంది.

సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.  ఈ అభ్యర్థులతో కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఇప్పటివరకు అభ్యర్థుల ప్రచార శైలి, లోటు పాట్లు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తీరు తెన్నులపై కేసీఆర్ ఈ సమావేశంలో వివరించారు.

ప్రత్యర్థులు బలాబలాలను కూడ ప్రస్తావిస్తూ తమ పార్టీ అభ్యర్థులు ఎలా ప్రచారంలో ఉన్నారనే విషయాలపై కూడ కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ 24 రోజులు చాలా కీలకమైనవి కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు.

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో సుమారు 15 నుండి 16 అసెంబ్లీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ అద్భుత విజయాలు సాధిస్తోందని ఆయన ఈ సమావేశంలో ప్రకటించారు.

రెండో దఫా రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏ రకంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామనే విషయమై ప్రజలకు అవగాహాన కల్పించాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు.అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారమ్ లు అందించారు.

ఇప్పటికే రెండు దఫాలు మనం ప్రచారాన్ని పూర్తి చేశాం. కానీ, మహాకూటమి ఇంకా అభ్యర్థులను కూడ ఫైనల్ చేయలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ నెల 15 నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. రోజుకూ మూడు లేదా నాలుగు సభలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీటింగ్ హాల్ లోకి వెళ్లలేదు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఖైరతాబాద్  దానం నాగేందర్ కు సీటు కేటాయించే అవకాశం ఉంది.

డిసెంబర్ మూడో తేదీన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. మహా కూటమి అభ్యర్థులను ప్రకటిస్తే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావించారు. కానీ, మహాకూటమి అభ్యర్థులను ప్రకటించనందున డిసెంబర్ 3 తేదీన భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

హైద్రాబాద్ లో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. రోడ్ షో ల ద్వారా కేటీఆర్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.మిగిలిన జిల్లాలోని 70 నియోజకవర్గాల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.బలహీనంగా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను నియమించారు. 

మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత  అసంతృప్తులతో టచ్‌లో ఉండాలని  కేసీఆర్ సూచించారు.అనుమానాలు ఉంటే పార్టీ నేతలను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు.ఎన్నికల అధికారులు, పోలీసులతో మర్యాదగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.

 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ భేటీ

మరికాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ భేటీ, బీఫామ్స్ అందజేత

కార్యకర్తలతో కేసీఆర్ భేటీ, నామినేషన్ ఏర్పాట్లపై చర్చ

గజ్వేల్ అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ అనుకుంటున్నాడు: కేసీఆర్

click me!