
బీహార్ : భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కి చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్, సుపాల్ జిల్లాలోని వీర్ పుర్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్ బీ 45వ బెటాలియన్ కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.