తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఐఐ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారంనాడు హైద్రాబాద్ లో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే అధికారం మాదేననే విషయం స్పష్టంగా అర్ధమైందన్నారు.గత ఎన్నికలకు ముందు కూడా సీఐఐ సదస్సుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. విభిన్న కంపెనీలు మాత్రమే కాదు విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా హైద్రాబాద్ లో కన్పిస్తాయన్నారు మంత్రి కేటీఆర్.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన చెప్పారు. ముందు చూపుతో ఈవీ బ్యాటరీ తయారీ రంగంలో పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ లో పెరుగుతున్న యువ జనాభా ఎంతో అనుకూలం కానుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
వ్యాపారులు , పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు మరింత రెట్టింపు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2030 నాటికి 250 బిలియన్ డాలర్ల వృద్ది సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద్రాబాద్ కు ఎన్నో అనుకూలతలు, బలాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.తొమ్మిది బిలియన్ టీకాలు హైద్రాబాద్ లో ఉత్పత్తి అవుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైద్రాబా్ లోనే తయారౌతున్నాయని మంత్రి తెలిపారు. ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నట్టుగా మంత్రి వివరించారు. సుల్తాన్ పూర్ వద్ద అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పార.
లైఫ్ సైన్సెస్ తో పాటు టెక్నాలజీ రంగానికి హైద్రాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉపగ్రహల తయారీ మొట్టమొదటగా హైద్రాబాద్ లో జరిగిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రైవేట్ గా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు. డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసే వినూత్న కార్యక్రమాలను చేపట్టామన్నారు. హైద్రాబాద్ లో ప్రముఖ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి తెలిపారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ వంటి సంస్థలు హైద్రాబాద్ లో అతి పెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేశాయని కేటీఆర్ వివరించారు.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్
అబివృద్ది చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూత ఇవ్వాలన్నారు. కానీ కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహయ సహకారాలు రావడం లేదన్నారు. మేకిన్ ఇండియా మంచి నినాదం, కానీ అది అమలయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఏం తినాలి ? ఏ బట్టలు వేసుకోవాలని డిసైడ్ చేయడానికి మీరెవరని ఆయన పరోక్షంగా బీజేపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయలేదన్నారు. హైద్రాబాద్ ఫార్మా సిటీకి కేంద్రం నయా పైసా ఇవ్వలేదన్నారు. దేశానికి హైద్రాబాద్ లాంటి నగరాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే భిన్నమైన అభిప్రాయాల వేదికగా ఆయన పేర్కొన్నారు.