నవీన్ హత్య కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు హరిహరకృష్ణ ప్రయత్నించినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్: నవీన్ శరీరబాగాలను దగ్దం చేసిన తర్వాత హోటల్ కు వెళ్లి బిర్యానీ తిన్నారు హరిహరకృష్ణ అతని స్నేహితులు. ఈ కేసు విషయమై భోజనం చేసే సమయంలో స్నేహితులతో హరిహరకృష్ణ చర్చించాడు. నవీన్ ను హత్య చేసిన విషయాన్ని వెంటనే తన లవర్ కు, స్నేహితుడు హసన్ కు హరిహరకృష్ణ చెప్పాడు. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఈ నెల 17వ తేదీన రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ కు సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో నవీన్ ను హరిహరకృష్ణ హత్య చేశాడు. నవీన్ ను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను కోసేసి హరిహరకృష్ణ బ్యాగులో వేసకున్నాడు. బ్రహ్మణపల్లికి సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఈ భాగాలను వేశాడు. బ్రహ్మణపల్లిలోని తన స్నేహితుడు హసన్ ఇంట్లో రాత్రి ఉన్నాడు. స్నానం చేసి పడుకున్నాడు. హసన్ వద్ద దుస్తులు తీసుకొని వేసుకున్నాడు. రక్తంతో తడిసిన దుస్తులను మరునాడు దగ్దం చేశారు.
గత నెల 18వ తేదీన హైద్రాబాద్ హస్తినాపురంలో ఉండే తన లవర్ ఇంటి సమీపానికి హరిహరకృష్ణ వెళ్లాడు. నవీన్ ను హత్య చేసిన విషయాన్ని ఆమెకు హరిహరకృష్ణ చెప్పాడు.
తన వద్ద డబ్బులు లేవని చెబితే లవర్ అతనికి రూ. 1500 ఫోన్ పే ద్వారా పంపిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వంరగల్, నల్గొండ, ఖమ్మం, కోదాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో తి రిగి గత నెల 24న హైద్రాబాద్ కు తిరిగి వచ్చాడు హరిహరకృష్ణ. బ్రహ్మణపల్లి వద్ద నిర్మానుష్యప్రాంతంలో వేసిన నవీన్ శరీరబాగాలను తీసుకొని నవీన్ ను హత్య చేసిన అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి దగ్దం చేశాడు హరిహరకృష్ణ.
ఈ సమయంలో హరిహరకృష్ణలవర్, హసన్ కూడా ఉన్నాడు. నవీన్ శరీర భాగాలను హసన్, హరిహరకృష్ణలు దగ్దం చేశారు. అనంతరం అక్కడి నుండి అంబర్ పేటకు సమీపంలో జాతీయ రహదారికి పక్కగా ఉన్న హోటల్ లో ఈ ముగ్గురు బిర్యానీ తిన్నారు. భోజనం చేసే సమయంలో ఈ కేసు గురించి చర్చించుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారా, లోంగిపోవాలా అనే విషయమై హరిహరకృష్ణ వీరిద్దరితో చర్చించినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అదే రోజు సాయంత్రం హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.
also read:పచ్చబొట్టు ఆధారంగా నవీన్ డెడ్‌బాడీ గుర్తింపు: తండ్రి శంకర్ నాయక్
ఈ నెల 3వ తేదీన పోలీసులు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసు విషయమై పోలీసుల ప్రశ్నలకు హరిహరకృష్ణ నుండి పొంతనలేని సమాధానాలు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని భావించారు. హరిహరకృష్ణ లవర్ , హసన్ లతో కలిపి హరిహరకృష్ణను విచారించిన సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో హసన్, హరిహరకృష్ణ లవర్ లను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.