రైతు భీమా మాదిరిగా చేనేత కార్మికులకు భీమా: కేసీఆర్ హామీ

By narsimha lodeFirst Published Jul 4, 2021, 3:52 PM IST
Highlights

రైతు భీమా తరహలోనే చేనేత కార్మికులకు కూడ భీమా సౌకర్యాన్ని కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

సిరిసిల్ల:రైతు భీమా తరహలోనే చేనేత కార్మికులకు కూడ భీమా సౌకర్యాన్ని కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  రైతుల మాదిరిగా మృతి చెందిన  చేనేత కుటుంబాలకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రెండు మూడు నెలల్లో ఈ పథకాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

సిరిసిల్లలలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కన్నీళ్లు పెట్టించేవని ఆయన గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరెలను ఆర్డర్ ఇచ్చినట్టుగా చెప్పారు.
రాష్ట్రంలోని పోచంపల్లి, దుబ్బాక, గద్వాల, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారన్నారు. బతుకమ్మ చీరేలు చేనేత కార్మికులకు కొంత ఉపాధిని కల్పించాయని ఆయన చెప్పారు.  
చేనేత కార్మికుల కోసం ఏం చేయాలో వాటి విషయమై సీఎస్  నేతృత్వంలో అధికారులు సమీక్షించి  భీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. 


 

click me!