ఐఏఎస్‌ల పాఠ్యాంశంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీటి సంరక్షణా విధానం: కేటీఆర్

By Siva KodatiFirst Published Jul 4, 2021, 3:23 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా మెడపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 35 ఎకరాల్లో రూ.83 కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టి 1320 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా మెడపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 35 ఎకరాల్లో రూ.83 కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టి 1320 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు 6 మీటర్లు పైకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లోనూ పెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. నేత కార్మికుల వేతనాలు డబుల్ అయ్యాయన్నారు.

అంతకుముందు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్‌(ఇన్‌స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్)ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. డ్రైవింగ్ స్కూల్ తెలంగాణకే మణిహారమని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణమని అన్నారు. సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేసినట్లు, తెలంగాణలోనే తొలి సెంటర్‌గా ఇది ఖ్యాతిగాంచిందని సీఎం పేర్కొన్నారు

దక్షిణ భారత దేశంలో ఇది నాలుగోదని, రూ.16.48 కోట్లతో నాలుగేండ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేశామన్నారు. మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో 58,165 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు, సూపర్‌ టెక్నాలజీతో నెలకొల్పిన ఈ కేంద్రంలో నెలకు 400 మందికిపైగా శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చంద్రశేఖర్ రావు వెల్లడించారు. హెవీ వెహికల్స్ డ్రైవర్స్‌కు గుణాత్మక హెవీ డ్రైవింగ్ పద్దతులను అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల అవసరాలను తీర్చుతుందని ఆయన తెలిపారు.

click me!