రైతులను ఆదుకుంటాం.. పంట నష్టం అంచనాకు ఆదేశించాం - మంత్రి తుమ్మల

By Sairam Indur  |  First Published Mar 20, 2024, 10:03 PM IST

రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని అన్నారు. పంట నష్టం అంచనాకు సర్వే చేపడుతామని స్పష్టం చేశారు.


ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఆయన పంట నష్టం అంచనాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆశ్చర్యం.. మెదడులో రక్తం కారుతున్నా.. శివరాత్రికి సద్గురు అంత ఉత్సాహంగా ఎలా ఉన్నారు ?

Latest Videos

రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వారికి అవసరమైన మద్దతును ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. గురువారం నుంచి అధికారులు రైతు కేంద్రీకృత సర్వే నిర్వహించి పంట నష్టాన్ని గుర్తించనున్నారని తెలిపారు. వారి నివేదిక అందిన వెంటనే ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి కూడా వేరుగా మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. సుమారు తొమ్మిది జిల్లాల్లో పంటలు దెబ్బతినగా, కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా దెబ్బతిన్నట్లు తెలుస్తోందని అన్నారు. వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్ నుంచి రైతులకు పంటల బీమా వర్తింపజేస్తామని తెలిపారు.

భారత ప్రజాస్వామ్యానికి లోక్ సభ ఎన్నికలు కీలకం.. - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

కాగా.. రెండు, మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో పూతతో పాటు, కాయలు కూడా రాలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. మొక్కజొన్న, వరి, గోధుమ వంటి పంటలు గాలి వల్ల నేలను తాకాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

click me!