అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తాం: రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Oct 11, 2021, 8:23 PM IST
Highlights

జన గణనలో కుల గణన చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. ఇవాళ ఇందిరా భవన్ లో నిర్వహించిన ఆల్ పార్టీ సమావేశంలో ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

హైదరాబాద్: జన గణనలో కుల గణన చేయాలని టీపీసీసీ చీఫ్ revanth reddy డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఇందిరా భవన్ లో tpcc బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించినall party meeting లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

also read:కేటీఆర్ ఓ దద్దమ్మ... రేవంత్ ను చూస్తేనే లాగులు తడుస్తున్నాయి: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్

సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన చేయాలన్నారు. మోడీ వన్ నేషఁన్ వన్ సెన్సెస్ ను ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు.కుల గణనను  modi సర్కార్ ఎందుకు చేయడం లేదని రేవంత్ అడిగారు. దీని వెనుక ఉన్న కారణాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీల ఓట్లు లేకుండా చట్టసభల్లోకి ఎవరూ కూడ అడుగు పెట్టలేరన్నారు. bcలకు న్యాయం జరిగే వరకు congress పార్టీ పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే విషయమై కార్యాచరణ రూపొందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడ జనగణనలో కూడ కుల గణనను చేయాలని ఇటీవలనే తీర్మానం చేసింది. ఈ తీర్మాణానికి విపక్షాలు మద్దతును ప్రకటించాయి.

 


 

click me!