డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే:కరోనాపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్

By narsimha lodeFirst Published Oct 11, 2021, 4:58 PM IST
Highlights

డిసెంబర్ వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కోరారు. రానున్న మూడు నెలలు పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

హైదరాబాద్: డిసెంబర్ వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ srinivasa rao ప్రజలను కోరారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న మూడు నెలలు పండుగల సీజన్ అని శ్రీనివాసరావు చెప్పారు. పండుగల సందర్భంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.  corona నిబంధనలను కచ్చితంగా పాటించాలని  ఆయన సూచించారు.

also read:24 గంటల్లో కేవలం 190 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,67,725కి చేరిన కేసుల సంఖ్య

కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కన్పిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాస రావు కోరారు..పండుగల సందర్భంగా విందులు, వినోదాలతో పాటు  షాపింగ్ లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. mask ధరించడంతో పాటు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు బాగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. అన్నిఆసుపత్రుల్లో ఆక్సిజన్, పీడియాట్రిక్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనా కేసులు దేశంలో తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓనం  సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులతో  ఆ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉందనే విమర్శలు లేకపోలేదు. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి.


 

click me!