కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేయబోతున్నాం...: మధు యాష్కి సంచలనం

By Arun Kumar P  |  First Published Jan 29, 2024, 12:19 PM IST

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేసారు. 


హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి సీరియస్ అయ్యారు. అధికారంలో వుండగా కేసీఆర్, ఆయన కుటుంబం భారీ అవినీతికి పాల్పడ్డారని... వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెడుతుందని అన్నారు. అవసరమైతే కేసీఆర్ అవినీతిని సొత్తును దాచిన ఫామ్ హౌస్ పైనా దాడి చేస్తామంటూ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలగా సంపాదించిన వందలకోట్లను కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాచుకున్నారని మధు యాష్కి ఆరోపించారు. కరెన్సీ నోట్ల కట్టలపైనే కేసీఆర్ పడుకుంటారని... ఫామ్ హౌస్ గోడల్లో వజ్రవైఢూర్యాలు దాచారని అన్నారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్ పై దాడిచేసి ఆ అవినీతి సొత్తును బయటపెడతామని... ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మాజీ ఎంపీ తెలిపారు. 

Latest Videos

కేసీఆర్, ఆయన కుటుంబం గత పదేళ్లుగా చేసిన అవినీతి, అక్రమాలను రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందే బయటపెడతామని మధు యాష్కి హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబాన్నే కాదు వారికి సహకరించిన అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.      బిజెపి, బిఆర్ఎస్ ది అవినీతి బంధమని ... దీన్ని కూడా బయటపెడతామని మధు యాష్కి తెలిపారు. 

Also Read  మేం అనుకుని వుంటే.. సగం కాంగ్రెస్ వాళ్లు జైళ్లలోనే : హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

అవినీతి విషయంలో తండ్రి కేసీఆర్ ను తనయుడు కేటీఆర్ మించిపోయాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ వున్న విలువైన భూములను అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కేటీఆర్ వేలకోట్లు దోచుకున్నాడని...ఈ డబ్బంతా అతడు దుబాయ్, అమెరికాకు తరలించాడని అన్నారు. ఇక కేసీఆర్ కూతురు కవిత కూడా భారీ ఆస్తులు సంపాదించిందని మధుయాష్కి ఆరోపించారు. 

తెలంగాణ ప్రజల సొత్తును దోచుకున్న కేసీఆర్ కుటుంబం వాటితో ప్రజాస్వామ్యాన్ని కూనీచేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అధికారం కోసం గుంటకాడి నక్కలా ఎదురుచూస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కవిత మంతనాలు జరిపిందని మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేసారు. 
 

click me!