దేశ రాజకీయాల్లో పరివర్తన కోసమే బీఆర్ఎస్: కేసీఆర్

By narsimha lode  |  First Published Dec 9, 2022, 4:52 PM IST

తమ పార్టీకి చెందిన పలు పాలసీలను త్వరలోనే ప్రకటించనున్నామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కేసీఆర్  పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. 


హైదరాబాద్:దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ తరహలో  పనిచేస్తే అమెరికాను మించిన ఆర్ధిక వ్యవస్థ ఇండియా సృష్టించనుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్ లో శుక్రవారంనాడు  బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కేసీఆర్  మాట్లాడారు. దేశంలో సమాఖ్య స్పూర్తిని కాపాడాల్పిన అవసరం ఉందన్నారు. నియంతృత్వ ధోరణి పోవాలన్నారు.కొత్త ఆర్దిక, జల వంటి విధానాలను  ప్రకటించనున్నట్టుగా కేసీఆర్  ప్రకటించారు.   

పిడికెడు మందితో  తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.   అందరి కృషితో తెలంగాణ కల సాకారమైందని కేసీఆర్  చెప్పారు.టీఆర్ఎస్ పార్టీ సభ్యుల 60 లక్షలుగా ఉంటుందన్నారు. తెలంగాణను సాధించుకున్న తర్వాత  అనేక విప్లవాత్మక పథకాలతో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కరోనా వంటి  కష్టాలు వచ్చినా రాష్ట్రం మాత్రం అభివృద్దిలో వెనుకడుగు వేయలేదన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలు అభివృద్దిలో వెనుకడుగు వేశాయని కేసీఆర్  చెప్పారు. పూర్తిస్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడపడంతో ఆ ఫలితాలు కన్పిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు.దేశానికే మనం  స్పూర్తిగా నిలిచినట్టుగా కేసీఆర్  చెప్పారు.

Latest Videos

undefined

ఉద్యమ సమయంలో  పాలమూరులో  పల్లెల నుండి  వలసలు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  పాలమూరు పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా మారిందని కేసీఆర్  గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పాలమూరులోని నడిగడ్డ ప్రాంతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  కానీ ఈ పరిస్థితులన్నీ మారినట్టుగా కేసీఆర్ తెలిపారు. 

ఇన్ని ఇబ్బందులున్న తెలంగాణనే అద్భుతంగా అభివృద్ది చేసున్నామన్నారు.  భారతదేశం అద్భుతమైన రత్నగర్భ అని కేసీఆర్  చెప్పారు. అంతేకాదు  ప్రపంచంలోనే ఏ దేశంలో లేని మానవనరులు మన దేశంలో ఉన్నాయన్నారు.50 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి దేశంలో ఉందని కేసీఆర్  చెప్పారు. నదుల్లో  70 వేల టీఎంసీల నీటి నిల్వలున్నాయన్నారు.అయినా కూడా రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలున్నాయని కేసీఆర్  చెప్పారు. బకెట్ నీళ్ల కోసం చెన్నైవాసులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై  తీసిన సినిమా అద్భుత విజయాన్ని సాధించిన కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఎకరానికి  నీళ్లిచ్చినా  30 వేల టీఎంసీల నీళ్లు సరిపోతాయని  కేసీఆర్  చెప్పారు. మంచినీళ్లు, పరిశ్రమలకు పదివేల టీఎంసీలు ఇస్తే ఇంకా కూడా  సమృద్దిగా దేశంలో నీటి నిల్వలుంటాయని కేసీఆర్  వివరించారు. 

also read:ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి: పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

అసాధ్యమైన పనులు అద్భుతంగా చేశారని ఇతర సీఎం అంటుంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని కేసీఆర్ చెప్పారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకొన్నది అనుకున్నట్టుగా జరగాలంటే  ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలన్నారు.   గెలిచిన ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలని కేసీఆర్  చెప్పారు.  ఆ పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పడిందని కేసీఆర్  ప్రకటించారు. 

click me!