తెలంగాణతో కేసీఆర్ కు బంధం తెగిపోయింది: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 9, 2022, 3:14 PM IST

టీఆర్ఎస్ పేరు మార్చడంతో కేసీఆర్ కు తెలంగాణతో  బంధం తెగిపోయిందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు


హైదరాబాద్: టీఆర్ఎస్  పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో  తెలంగాణతో  కేసీఆర్ కు పేగు బంధం, పేరు బంధం కూడా  తెగిపోయిందని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  విమర్శించారు.శుక్రవారం నాడు సికింద్రాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ గులాబీ  కూలీకి సంబంధించిన అంశంపై  తాను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు.ఈ పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరిగే అవకాశం ఉందని  రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో కేసు ఉన్న విషయాన్ని ఈసీకి చెప్పినా పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ పేరును మార్చడం కోర్ఠు ధిక్కారం కిందకు వస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ విషయమై ఈసీ తీరుపై  న్యాయ పోరాటం చేస్తామన్నారు.

also read:ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి: పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 

Latest Videos

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను  మళ్లీ కలిపితే తమ కంటే సంతోషించే వారుండరని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చేసిన  వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలను  టీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్‌ఎస్ గా  తీర్మానం చేస్తూ  ఈసీకి  పంపిన  అడ్రస్ లోనే  ఏపీగా  పేర్కొన్నారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు  కావని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

గులాబీ కూలీపై టీఆర్ఎస్  నేతలు అవినీతికి పాల్పడ్డారని  రేవంత్ రెడ్డి  దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. అంతేకాదుఈ విషయమై కోర్టును కూడా ఆశ్రయించారు. కేంద్ర ఎన్నికల సంఘం, ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు.  గులాబీ కూలీ పేరుతో డబ్బులు వసూలు చేసిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే.2017 ఏప్రిల్  27న టీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం గులాబీ కూలీ నిర్వహించారు.  ఈ విషయమై గతంలోనే ఢిల్లీ హైకోర్టులో కూడా రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరగనుంది.
 

click me!