మరో మూడు రోజులు వర్షాలు: హైదరాబాద్ వరదలపై కేటీఆర్

By narsimha lodeFirst Published Oct 19, 2020, 2:23 PM IST
Highlights

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలంతా  పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.  జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలంతా  పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.  జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

also read:వరద నీటిలోనే మీర్‌పేటవాసుల నిరసన: సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.

భారీ వర్షాలతో ఇప్పటివరకు 33 మంది మరణించారని ఆయన చెప్పారు. ఇంకా ముగ్గురి ఆచూకీ కోసం  ప్రయత్నిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల నుండి వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలను యుద్ధప్రాతిపదికన  కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు.హైద్రాబాద్ చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. సుమారు వందేళ్ల తర్వాత హైద్రాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదైంది.

80 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించామని ఆయన తెలిపారు.  ఇప్పటికే 50 బోట్లను సిద్దం చేశామని ఆయన చెప్పారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నించామన్నారు. 

నాలాలు,చెరువులు  కబ్జాకు గురయ్యాయన్నారు. నాలాల కబ్జా ఏదో ఒకరోజు మాత్రమే జరిగింది కాదన్నారు. నగరంలోని 30 కాలనీలు  ఇంకా నీటిలోనే ఉన్నాయని చెప్పారు. ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి  సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్లను కూడ సిద్దం చేసుకోవాలని సూచించామన్నారు.

బోట్ల కోసం ఇప్పటికే ఏపీ రాష్ట్రంతో తాము సంప్రదించినట్టు ఆయన తెలిపారు.1903లో 43 సెంమీ. 1916లో 160 సెంమీ. వర్షపాతం నమోదైందని ఆయన గుర్తు చేశారు. అసాధారణ పరిస్థితుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. విశ్వనగరాలుగు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.

click me!