విద్యాబుద్దులు నేర్పిన గురువుకోసం... కదిలిన కేటీఆర్

By Arun Kumar PFirst Published Oct 19, 2020, 10:30 AM IST
Highlights

తనకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్ సమస్యల్లో వున్నాడని తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ దాన్ని పరిష్కరించి గురుభక్తిని చాటుకున్నాడు. 

హైదరాబాద్: బిజీ షెడ్యూల్ లోనూ విద్యాబుద్దులు నేర్పిన గురువు  కోసం మంత్రి కేటీఆర్ కదిలారు. పాఠశాలలో చదువకునే రోజుల్లో చదువునేర్పిన గురువు సమస్యల్లో వున్నాడని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా స్వయంగా స్థానిక ఎమ్మెల్యేకు ఆదేశించారు. ఇలా తన గురుభక్తిని చాటుకున్నాడు మంత్రి కేటీఆర్. 

హైస్కూళ్లో చదువకునే సమయంలో కేటీఆర్ కు సత్యనారాయణ విద్య నేర్పారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్ లోనే అడిక్ మెట్ లలితానగర్ డివిజన్ లో నివాసముంటున్నాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతడు నివాసముంటున్న లలితానగర్ లో డ్రైనేజ్ ఓవర్ ప్లో అవుతోంది. దీంతో కాలనీవాసులందరితో పాటు సత్యనారాయణ కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతోంది. 

దీంతో అతడు ఈ సమస్యను ట్విట్టర్ వేదికన తన శిష్యుడయిన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో ఎమ్మెల్యే గోపాల్ అధికారులతో కలిసివెళ్లి సమస్యను పరిశీలించడమే కాదు వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  
 


 

click me!