హైద్రాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నుండి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Hussain Sagaar నిండిపోవడంతో Musi లోకి నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు రోజులుగా హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. అయితే పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా మూడు రోజులు Telangana లో వర్షాలు ఉన్నందున హుస్సేన్ సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉందని భావించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నాళాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది.
2020 అక్టోబర్ మాసంలో హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఒక్క రోజు వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండింది. దీంతో హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 2020 ఆగష్టు మాసంలో కురిసిన వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండింది. అయితే అక్టోబర్ మాసంలో కురిసిన వర్షాలకు వచ్చిన నీటిని దిగువకు విడుదల చేశారు.అంతకు ముందు 2019లో కూడా హుస్సేన్ సాగర్ నిండింది. భారీ వర్షాలతో వచ్చిన వరదతో హుస్సేన్ సాగర్ నిండింది.
undefined
ఎగువన ప్రాంతాల నుండి వస్తున్న వరదల కారణంగా నగరంలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఈ నెల 10వ తేదీన ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నగరంలో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలలో జీహెచ్ఎంసీ అధికారులు 40 మంది బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాదు హైద్రాబాద్ లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అవసరమైన ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపట్టనున్నాయి.
నగరంలో కురుస్తున్న వర్షాల నేపథయంలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఇవాళ్టితో సెలవులు ముగియనున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.