కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద: సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన

By narsimha lode  |  First Published Jul 13, 2022, 9:30 AM IST


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లలో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్క గేటు మాత్రం ఓపెన్ కావడం లేదు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 
 


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని Kadam ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పై నుండి వరద నీరు కిందకు వస్తుంది.  దీంతో అధికారులు కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టు Gatesఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 64 ఏళ్ల క్రితం ఇంత భారీ స్థాయిలో వరద వచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 

5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 18 గేట్లలో ఒక్క గేటు తెరుచుకోవడం లేదు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో కు తగ్గట్టుగా అవుట్ ఫ్లో లేని పరిస్థితి చోటు చేసుకొంది. దీంతో కడెం ప్రాజెక్టుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంగళవారం నాడు రాత్రే ఈ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులుసూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 

Latest Videos

undefined

Telangana  రాష్ట్రంలో దాదాపు ఆరు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో Heavy Rains  కురిశాయి. మరో వైపు  Godavar River తో పాటు దాని ఉప నదులు కూడా పోటెత్తాయి.ఈ పరిస్థితుల్లో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. 

కడెం ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. కానీ ప్రాజెక్టు నుండి  2.98 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు వద్ద సైరన్ ను మోగించారు. మిగిలిన గేటు కూడా తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

also read:weather report : దంచికొడుతున్న వాన‌లు.. నిండుకున్న జ‌లాశ‌యాలు.. తెలంగాణ‌లో మ‌రో మూడు వర్షాలే..

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం తెల్లవారుజాము నుండి కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

కడెం,అన్నాపూర్, దేవునిగూడ, రాపాడు, మున్యాల తదితర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. కడెం లోని సుమారు 1100 వందల మందిని పోలీస్ స్టేషన్ , ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీప ప్రాంతాలకు తరలించారు. హైద్రాబాద్ నుండి ఎన్డీఆర్ఎప్ బృందాలను కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలకు తరలించారు. కడెం  ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా సూచించారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వెళ్లి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

click me!