భద్రాచలం వద్ద గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.బుధవారం నాడు సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు చేరే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని Bhadrachalam వద్ద గోదావరికి వరద మరింత పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాడు సాయంత్రానికి Godavari నది భద్రాచలం వద్ద 66 అడుగులకు చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. .దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం కలెక్టర్ అనుదీప్ కోరారు. ఇప్పటికే భద్రాలచం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో గోదావరికి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది.
గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో గోదావరికి వరద పోటెత్తింది. నిన్న సాయంత్రానికి గోదవరికి భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొంత తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. కానీ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో వరద ప్రవాహం మళ్లీ పెరగడంతో గోదావరికి మరోసారి భారీ ఎత్తున భద్రాచలం వద్ద వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవాహం ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం నుండి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. భద్రాచలం నుండి ఛత్తీస్ ఘడ్ కు వెళ్లే జాతీయ రహదారిపై కూడా వదర నీరు పోటెత్తడంతో పోలీసులు ఈ రహదారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
undefined
also read:కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద: సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
గోదావరి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి 45 అడుగులు దాటితేనే భద్రాచలం వద్ద ఇబ్బందికర పరిస్థితులుంటాయి. అయితే సాయంత్రానికి 66 అడుగులకు వరద ప్రవాహం చేరితే ఇబ్బందికర పరిస్తితులు ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మహారాష్ట్రలోని నాసిక్ నుండి కూడా దిగువన ఉన్న ధవళేశ్వరం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుందని అధికారులు చెబుతున్నారు.బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాచలానికి ఎగువన ఉన్న కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 13.73 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడగడ్డ బ్యారేజీలోకి భారీగా గోదావరి వరద వచ్చి చేరుతుంది. 12,10,600 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ప్లో 7,78,000లుగా ఉందని అధికారులు ప్రకటించారు. సరస్వతి బ్యారేజీ 62 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సరస్వతి బ్యారేజీ నీటి మట్టం 3.28 టీఎంసీలు, బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 10.87 టీఎంసీలు.