పటాన్‌చెరులో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్.. కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి తిరిగిరాకపోవడంతో..

Published : Feb 26, 2023, 09:54 AM IST
పటాన్‌చెరులో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్.. కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి తిరిగిరాకపోవడంతో..

సారాంశం

హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో డిగ్రీ చదువుతున్న  ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో డిగ్రీ చదువుతున్న  ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ నెల 24న కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. వివరాలు.. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నాగన్న కూతురు జ్యోతి సంగారెడ్డిలోని  ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్‌లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే శుక్రవారం కాలేజ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన జ్యోతి.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. 

మరోవైపు జ్యోతి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులకు, తెలిసినవారికి ఫోన్‌లు చేశారు. అలాగే పలుచోట్ల జ్యోతి ఆచూకీ కోసం గాలింపు  చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దీంతో జ్యోతి తండ్రి నాగన్న పోలీసులను ఆశ్రయించారు. నాగన్న  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?
Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది