అమ్రపాలి.. అన్నపూర్ణ

Published : Nov 23, 2016, 01:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
అమ్రపాలి.. అన్నపూర్ణ

సారాంశం

వరంగల్ కలెక్టర్ నూతన పథకం కరెన్సీ రద్దు నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే ప్రయత్నం హోటళ్లు, ఫంక్షన్లలో మిగిలిన అన్నం పేదలకు..

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మధ్యతరగతి వారికే రోజు గడవడం  కష్టంగా ఉంది. ఇక పేదల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు.ఒక వైపు పని దొరక్క, మరోవైపు చేతిలో ఉన్న డబ్బులు చెల్లక పేదలు, యాచకులు, కూలీలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో వారి ఆకలి తీర్చేందుకు వరంగల్ అర్బన్ కలెక్టర్  అమ్రపాలి ‘‘అన్నం పరబ్రహ్మ సహకార ఆహారం’’ పేరుతో ఒక కొత్త  పథకాన్ని తీసుకొచ్చారు.

 

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో కలిసి కలెక్టర్ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారు. నగరంలోని హోటళ్లు, ఫంక్షన హాళ్లలో మిగిలిన ఆహారాన్ని పారేయకుండా పేదల ఆకలి ని తీర్చేందుకు అందించాలని కోరుతున్నారు.

 

ఈ పథకం కిం ద గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో 9 ప్రాం తాల్లో ఆహార సేకరణకు ఏర్పాట్లు చేశారు. ఆహార నాణ్యతను ఫుడ్‌ ఇనస్పెక్టర్లు, కార్పొరేషన ఆరోగ్య అధికారి పర్యవేక్షిస్తారు. ఆహారా న్ని ప్యాకెట్లలో భద్రపరిచి వాటి మీద సేకరించిన తేదీని నమోదు చేస్తారు.

 

ఈ కార్యక్రమాన్ని ఈనెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకం అమలు తీరును బట్టి మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. ఎంజీఎం సెంటర్‌, హన్మకొండ బస్టాండ్‌, వరంగల్‌, కాజీపేట రైల్వేస్టేషన్లు, హన్మకొండ కలెక్టరేట్‌, పాలమూరు గ్రిల్‌ సెంటర్‌, పోచమ్మ మైదానతో పాటు మరో రెండు సెంటర్లలో ఏర్పాటు చేస్తారు. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?