మా దేశానికి రండి

Published : Nov 23, 2016, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మా దేశానికి రండి

సారాంశం

మంత్రి కెటిఆర్ కు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ ఆహ్వానం ఆస్ట్రేలియా ప్రధానితో సమావేశం అయ్యే అవకాశం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో డిసెంబర్ 5 జరిగే ఆస్ర్టేలియా ఇండియా లీడర్ షిప్ సమిట్ కు మంత్రి కెటి రామారావుకు ఆహ్వనం అందింది. ఆస్ట్రేలియా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ పాల్గొనే ఈ సమావేశంలో ప్రసంగించాల్సిందిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి జూలీ బిషప్ మంత్రి కెటిఆర్ కు పంపిన ప్రత్యేక ఆహ్వనంలో కోరారు.

 

ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య  వ్యాపార వాణిజ్య సంబంధాలను పెంచడం లక్ష్యంగా  ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇరుదేశాల్లోని 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభుత్వాధినేతలు, పాలసీ మేకర్లను, మేధావులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా అహ్వనిస్తారు.

 

ఇరు దేశాల్లోని ప్రభుత్వాల పనితీరు, అర్ధిక పరమైన అంశాలు, వ్యాపార రంగాల్లోని అవకాశాలపైన ఈ సమావేశంలో చర్చించున్నారని, ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రభుత్వ పాలసీలు, వ్యాపారావకాశాలపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కెటి రామారావును అక్కడి ప్రభుత్వం కోరింది.

 

తెలంగాణలోని ఐటి రంగం, పరిశ్రామిక పెట్టుబడులు, పట్టణ మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో భాగస్వాములయ్యేందుకు ఆస్ట్రేలియాలోని వ్యాపార, వాణిజ్య సంస్ధలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు అక్కడి తెలుగు కమ్యూనిటితో కలిసేందుకు అవకాశం కల్పిస్తుందని, ఏన్నారై మంత్రిగా ఇతర విషయాలను చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

 

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?