తన వాళ్ల కోసం 500 బాహుబలి టికెట్లు కొనేసిన వరంగల్ కలెక్టర్

Published : Apr 26, 2017, 10:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తన వాళ్ల కోసం 500 బాహుబలి టికెట్లు కొనేసిన వరంగల్ కలెక్టర్

సారాంశం

ఇంతకీ అంతమందికి కలెక్టర్ టికెట్ లు ఎందుకు బుక్ చేసినట్లు... ఆ 500 మంది ఎవరు అనేది తెలియడం లేదు.

తెలంగాణలోని యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లలో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి ఒకరు. ఇటీవల ఆమె తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఆ మధ్యన వేయిస్తంభాల గుడిలో జరిగిన ఓ పూజా కార్యక్రమానికి మోడ్రన్ దుస్తుల్లో రావడంతో అక్కడున్నవారంతా చెవులు కొరుక్కున్నారు.

 

ఇప్పుడు  ఆ కలెక్టర్ బాహుబలి ఫీవర్ తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఎందకంటే ఆమె స్థానికంగా  హన్మకొండలో ఉన్న  ఏషియన్ శ్రీదేవి థియేటర్లో 500 వందల టికెట్లు బుక్ చేసుకున్నారు. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి.

 

ఇంతకీ అంతమందికి కలెక్టర్ టికెట్ లు ఎందుకు బుక్ చేసినట్లు... ఆ 500 మంది ఎవరు అనేది తెలియడం లేదు.

 

అయితే నగర సుందరీకరణలో భాగంగా వరంగల్ ను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దుతున్న ఉద్యోగుల కోసమే  కలెక్టర్ ఈ వినూత్న గిఫ్ట్ ను అందిస్తున్నారని కొందరు అంటుంటే... అదేం కాదు తన స్నేహితులు, బంధువులు, స్థానిక రాజకీయనాయకులకు కలెక్టర్ టికెట్లు బుక్ చేశారని మరికొందరు అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. బతకడం కష్టమేనా.. షాకింగ్ నిజాలు !