‘తెలంగాణ’ పై నీతి ఆయోగ్ ప్రశంసలు

Published : Apr 26, 2017, 06:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
‘తెలంగాణ’ పై నీతి ఆయోగ్ ప్రశంసలు

సారాంశం

రుణమాఫీతో పోలిస్తే ఇది మంచి నిర్ణయమన్నారు. రుణమాఫీ ఇవ్వాలనుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ తరహాలో ఎరువులు ఇవ్వడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం మంచిదని సూచించారు.

నవ తెలంగాణ రాష్ట్రం పై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశం మొత్తం అనుసరించదగినవేనని అభిప్రాయపడుతోంది.

 

ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, విధివిధానాలను సమావేశంలో వివరించారు.

 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు తీరుపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది.  జీఎస్‌టీ బిల్లును తొలుత ఆమోదించినందుకు అభినందనలు తెలిపింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు సభ్యుడు రమేశ్‌ చంద్‌ తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతున్న రైతులకు ఉచిత ఎరువుల పథకం చాలా గొప్పదని పేర్కొన్నారు.

 

రుణమాఫీతో పోలిస్తే ఇది మంచి నిర్ణయమన్నారు. రుణమాఫీ ఇవ్వాలనుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ తరహాలో ఎరువులు ఇవ్వడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం మంచిదని సూచించారు.

 

సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం  ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

PREV
click me!

Recommended Stories

Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?
డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!