నిజామాబాద్ లో మానవత్వం ఇలా పరిమళించింది...

Published : Jun 14, 2017, 09:26 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
నిజామాబాద్ లో మానవత్వం ఇలా పరిమళించింది...

సారాంశం

నీకు అవసరం లేనివి నీ దగ్గర ఉంటే వాటి అవసరం ఉన్న వారికి పంచు.... అలాగే నీకు అవసరం ఉండి నీ దగ్గర లేకపోతే వాటిని పొందు.ఈ కాన్సెప్ట్ తో నిజామాబాద్ పట్టణములోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర ఒక వినూత్న ప్రయోగానికి తెర తీశారు. మానవత్వాన్ని పంచే గోడ అని దానిమీద ఇలా రాశారు నిజామాబాద్ కారుణ్యమూర్తులు.

మాయమైపోతున్న మానవత్వాన్ని బతికించేందుకు వాళ్ళ ఆరాటం.


నీకు అవసరం లేనివి నీ దగ్గర ఉంటే వాటి అవసరం ఉన్న వారికి పంచు.... అలాగే నీకు అవసరం ఉండి నీ దగ్గర లేకపోతే వాటిని పొందు.ఈ కాన్సెప్ట్ తో నిజామాబాద్ పట్టణములోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర ఒక వినూత్న ప్రయోగానికి తెర తీశారు.

 

మానవత్వాన్ని పంచే గోడ అని దానిమీద ఇలా రాశారు. నీకు ఉపయోగం లేనివి ఇంట్లో ఉంటే ఇక్కడ వదలంది అని గోడకు ఒకభాగంలో అలాగే... మీకు అవసరం అయినవి ఇక్కడ ఉంటే తీసుకెళ్లండి అని ఇంకోవైపు రాశారు.

దీనికి స్పందించిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు.తమ ఇంట్లో ఉన్న పాత వస్త్రాలను అక్కడ జమ చేశారు కొందరు. 
నవీన కాలంలో కొందరు వ్యక్తులు 20 నుండి 30 డ్రెస్సులు కూడా కొనుగోలు చేస్తిన్నారు. వాటిలో కొన్ని ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువగా వాడి ఉండరు. అలాంటివి ఇక్కడ ఇవ్వండి అని కోరుతున్నారు.

 

అయితే బొటాబొటి సంపాదన ఉన్నవాళ్లు రెండు మూడు జతల బట్టలతో కళమెల్లదీస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఇక్కడ ఉన్న వాటిని తీసుకుంటే నష్టం లేదన్నది నిర్వాహకుల ఉద్దేశం. 

 

అలాగే కొందరు చెప్పులు కూడా అక్కడ ఉంచుతున్నారు.

 

ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ముగ్గురు నిర్వాహకులు ఈ పనికి పూనుకున్నారు అని తెలిసింది.ఆయినదానికి కానిదానికి ప్రచార పిచ్చితో రగిలిపోయే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో ఈ ముగ్గురు మాత్రం ఎలాంటి వివరాలు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. తాము చేస్తున్న పని ఒక్కరి అవసరం తీరినా చాలు... ఒక్కరు దయాగుణం చూపినా చాలు అన్న ధోరణిలో ఉంది.

 

అయితే వీళ్ళు మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి మనవత్వపు గోడలు రూపొందించినట్లు తెలిసింది.

 

ఉదయం నుండి రాత్రి వరకు ఇచ్చేవాళ్ళు ఇవ్వగా తీసుకునే వాళ్ళు తీసుకోగా మిగిలిన వాటిని రాత్రిపూట తీసుకుపోతున్నారట. అలా తీసుకుపోయిన వాటిని ఇతర ప్రాంతాల్లో రూపొందించిన గోడల వద్దకు చేరుస్తున్నారట.

 

అందుకే ఆ kindness wall మీద ఎక్కడా తమ పేరు కానీ, తమ సంస్థ పేరు కానీ లేకపోవడం గమనార్హం.మొత్తానికి చిన్న ప్రయత్నమే అయినా వాళ్ళు చేస్తున్న పని అభినందనీయం అని పలువురు కొనియాడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?