పేరెంట్స్ వాట్సాప్ చాట్ తో పిల్లలను తరిమేసిన స్కూల్

Published : Jun 13, 2017, 04:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పేరెంట్స్ వాట్సాప్ చాట్ తో పిల్లలను తరిమేసిన స్కూల్

సారాంశం

పేరెంట్స్ వాట్సాప్, ఫేస్ బుక్ చాట్ వారి పిల్లలకు నష్టం కలిగించింది. పేరెంట్స్ మీద కోపంతోవారి చిన్నారులను ఆ స్కూల్ యాజమాన్యం టిసిలు ఇచ్చి పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. టిసిలు తీసుకెళ్లండి  అని స్కూల్ యాజమాన్యం నోటీసులు సైతం జారీ చేసింది. మరి తల్లిదండ్రులు మాత్రం స్కూల్ యాజమాన్యం తీరును విమర్శిస్తున్నారు. ఉన్నఫలంగా 25శాతం ఫీజులు పెంచడాన్ని ప్రశ్నించడంతో తమ పిల్లలకు టిసిలు ఇచ్చి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కుత్బుల్లాపూర్ పరిధిలోని నిజాంపేటలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివే విద్యార్థులకు మే నెలలో సుమారు 25 మంది చిన్నారులకు టిసిలు ఇచ్చేస్తాం... అంటూ వారి తల్లిదండ్రులకు మేనేజ్ మెంట్ నోటీసులు జారీ చేసిందిం. వాట్సాప్, ఫేస్ బుక్ లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని స్కూల్ యాజమాన్యానికి  వ్యతిరేకంగా, టీచర్లను హేళన చేస్తూ ఆయా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

 

దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల వివరణ ఇలా ఉంది. తాము సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేయలేదని అంటున్నారు. ఏకమొత్తంలో ఉన్న ఫీజును 25శాతం పెంచడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులంతా వ్యతిరేకించారని వారు అంటున్నారు. అలాంటి వారిలో సుమారు 150 మంది పిల్లల తల్లిదండ్రులకు నోటీసులు  జారీ చేసినట్లు చెబుతున్నారు. అందులో కొందరు తల్లిదండ్రులు మాత్రం సరెండర్ లెటర్స్ రాసి మేనేజ్ మెంట్ ను రిక్వెస్టు చేసుకుని అదే స్కూల్ లో వారి పిల్లలను  కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మేనేజ్ మెంట్ చర్యలను నిరసిస్తూ టిసిలు తీసుకొని వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో స్థానిక విద్యాశాఖ అధికారులు సైతం మేనేజ్ మెంట్ కే వత్తాసు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విజ్ఞాన్ మేనేజ్ మెంట్ దురుసు ప్రవర్తన కారణంగానే తాము టిసిలు తీసుకుని వెళ్తున్నట్లు కొందరు పేరెంట్స్ చెబుతున్నారు. 

 

 

 

మొత్తానికి వాట్సాప్ గ్రూపులో పోస్టుల  వ్యవహారం అభం శుభం తెలియని చిన్నారులను ఇరకాటంలోకి నెట్టబడింది.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా