విషాదం.. ఖాళీ స్థలంలో ఆడుకుంటుంటే కూలిన గోడ.. ఓ చిన్నారి మృతి, మరో బాలిక పరిస్థితి విషమం..

By SumaBala BukkaFirst Published Dec 22, 2022, 11:27 AM IST
Highlights

హైదరాబాద్ లో గోడకూలిన ఘటనలో ఓ ఆరేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాద ఘటన చోటుచేసుకుంది.  గోడ కూలిన ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన బుధవారం కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామ లక్ష్మణ రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ,  నిమ్బోలిఅడ్డలో నివాసం ఉంటున్న బండి సింగ్,సేవా రాజ్ కుటుంబాలు రాజస్థాన్ నుంచి నగరానికి వలస వచ్చారు. ఇక్కడ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు.

తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో బండి సింగ్  ఆరేళ్ల కొడుకు ధీరు సింగ్, సేవా రాజ్ ఐదేళ్ల కుమార్తె రాధిక తన ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నారు. ఈ సమయంలో పక్కన ఉన్న గోడ కూలి ఇద్దరు మీద పడింది. దీంతో ధీరు సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు రాధికను వెంటనే కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం యశోదా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు.  దీంతో బాలికకు యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అర్థరాత్రి కారు బీభత్సం.. నీరు చిమ్మించి, సారీ చెప్పలేదన్నందుకు.. టూవీలర్లను ఢీకొట్టించడంతో.. మహిళ మృతి..

ప్రమాదం సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి, మృతుడిని మార్చురీకి తరలించారు. అయితే గోడ కూలడానికి నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలో సత్యేందర్ అనే వ్యక్తి కొత్తగా ఇల్లు కట్టడం కోసం పిల్లర్లు పోస్తున్నాడు. అయితే తే.గీ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. నిర్లక్ష్యంగా ఇంటి నిర్మాణం పనులు చేస్తున్నందుకు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యం వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కారణమైన ఇంటి యజమాని సత్యేందర్ మీద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపారు. 

click me!