ఢిల్లీ చేరుకున్న గవర్నర్ తమిళిసై.. అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం..!

Published : Dec 22, 2022, 10:27 AM ISTUpdated : Dec 22, 2022, 10:29 AM IST
ఢిల్లీ చేరుకున్న గవర్నర్ తమిళిసై.. అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం..!

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆమె భేటీ అయ్యే అవకాశం ఉంది.   

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, మరికొందరు కేంద్ర మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తన వద్ద పెండిగ్‌లో ఉన్న బిల్లులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు తదిత అంశాలపై అమిత్ షాతో తమిళిసై చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?