పరకాలలో కంచ ఐలయ్యను అడ్డుకున్న ఆర్యవైశ్యులు

First Published Sep 23, 2017, 6:03 PM IST
Highlights
  • వరంగల్ వెళ్తుండగా ఆర్యవైశ్యుల నిరసన
  • సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై క్షమాపణ కోరిన ఆర్యవైశ్యులు
  • పరకాలలో ఘనట... ఉద్రిక్తత

వరంగల్ జిల్లా పరకాలలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకుని నిరసన తెలిపారు. 

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యను పరకాలలో ఆర్యవైశ్యులు అడ్డుకున్నారు. భూపాలపల్లి నుంచి వరంగల్ వెళ్తుండగా పరకాలలో ఐలయ్యను అడ్డుకుని నిరసన తెలిపారు.

ఆర్యవైశ్యులను స్మగ్లర్లు అని పుస్తకాన్ని రచించిన ఐలయ్యపై గత కొంతకాలంగా కోమటి కులానికి చెందిన వాళ్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఐలయ్య పుస్తకాన్ని బ్యాన్ చేయాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ లు చేస్తున్నారు. టిజి వెంకటేష్ లాంటి ఆర్యవైశ్య నేతలైతే ఏకంగా ఐలయ్యను ఉరి తీయాలంటూ ఘాటుగా కామెంట్లు చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలను హోరెత్తించారు ఆర్యవైశ్యులు. ఐలయ్య దిష్టబొమ్మల కాల్చివేతలు జరిగాయి. నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో పరకాలలో ఆయన వెళ్తున్న సమచారం తెలుసుకున్న కొందరు ఆర్యవైశ్యులు ఆయన కారును అడ్డగించి నిరసన తెలిపారు. దీంతో పరకాలలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేశారు.

అయితే తనపై దాడికి ప్రయత్నించిన ఆర్యవైశ్యుల మీద చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ ఐలయ్య పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

click me!