కమీషన్ ఇవ్వలేదని.. కత్తితో విచక్షణా రహితంగా దాడి....

By AN TeluguFirst Published Oct 28, 2021, 7:39 AM IST
Highlights

ప్లాట్‌ కొనుగోలులో రవీందర్ రెడ్డి అల్లుడు గౌని మోహన్ రెడ్డి mediatorగా వ్యవహరించాడు. Commission‌ కింద మోహన్ రెడ్డికి రూ. ఆరు లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నిసార్లు అడిగినా రవీందర్రెడ్డి స్పందించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి ని అంతం చేయాలని పథకం వేశాడు.

బంజారా హిల్స్ :  స్థల విక్రయంలో తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వలేదని అక్కసు పెంచుకున్న ఓ వ్యక్తి వరుసకు మేనమామ అయిన బిల్డర్‌పై వేటకొడవళ్లతో దాడి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. జూబ్లీహిల్స్ కు చెందిన బిల్డర్ రెడ్డిగారి రవీందర్రెడ్డి బేగంపేట్ లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు.

ఈ ప్లాట్‌ కొనుగోలులో రవీందర్ రెడ్డి అల్లుడు గౌని మోహన్ రెడ్డి mediatorగా వ్యవహరించాడు. Commission‌ కింద మోహన్ రెడ్డికి రూ. ఆరు లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నిసార్లు అడిగినా రవీందర్రెడ్డి స్పందించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి ని అంతం చేయాలని పథకం వేశాడు.

యూసుఫ్ గూడా  సమీపంలోని  జవహర్ నగర్ లో అద్దెకు ఉంటున్న మోహన్ రెడ్డి తన మామను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాడు.  కూకట్‌పల్లిలో ఒక కత్తిని తయారు చేయించి ఆ knifeని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ కు వచ్చి రవీందర్రెడ్డి నివసించే అపార్ట్మెంట్ సెల్లార్లో కత్తితో మాటువేశాడు.

ఉదయం ఏడున్నర గంటలకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు రవీందర్ రెడ్డి ఇంట్లో నుంచి కిందికి వచ్చి కారు తీస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన మోహన్ రెడ్డి కత్తితో తల, చేతులు, చెవులు, ముఖంపై పొడిచాడు. 

రవీందర్ రెడ్డి అరుపులకు ఆయన భార్య మోహన్ రెడ్డిని ఆపేందుకు ప్రయత్నించింది. అంతేకాదు మీ కమిషన్ ఇస్తాం, ఆయన్ని వదిలేయమని వేడుకోవడంతో మోహన్ రెడ్డి పక్కకి జరిగాడు.

అప్పటికే తీవ్రంగా గాయపడిన builder ravinder reddyని స్థానికుల సహకారంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. 

మానవత్వం చాటుకున్న హరీష్ రావు: క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

ఇదిలా ఉండగా... బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు మృతిచెందారు. దాదాపు 30 మందికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే తొలుత గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసు బలగాలు గ్రామంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఘర్షణల్లో మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ గొడవలు చోటుచేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

click me!