తెలంగాణలోనూ ఏవై.4.2 వేరియంట్.. ఇద్దరిలో గుర్తింపు...!

By AN TeluguFirst Published Oct 28, 2021, 8:06 AM IST
Highlights

సెప్టెంబర్ లో తెలంగాణ లో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్తనమూనాలను హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీలో genome sequencingకు పంపించారు.  కాగా వీటిలో రెండు (0.6%) ‘ఏవై.4.2’ రకం కేసులు ఉన్నట్లు తేలింది. 

హైదరాబాద్ :  బ్రిటన్ ను వణికిస్తున్న‘ఏవై.4.2’ రకం కరోనా వైరస్  కేసులు తెలంగాణలోనూ వెలుగుచూశాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఈ విషయం బయటపడింది. ఇద్దరిలో ఈ తరహా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 26 వేల ‘ఏవై.4.2’ కేసులు GISAIDలో నమోదైనట్టు తాజాగా WHO ఒక నివేదికలో పేర్కొంది.

బాధితుల వివరాలు  గోప్యం
సెప్టెంబర్ లో తెలంగాణ లో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్తనమూనాలను హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీలో genome sequencingకు పంపించారు.  కాగా వీటిలో రెండు (0.6%) ‘ఏవై.4.2’ రకం కేసులు ఉన్నట్లు తేలింది. 

48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళకు సంబంధించిన ఆ రెండు రక్త నమూనాలు నిమ్స్ నుంచి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వచ్చాయి.  ఈమేరకు వివరాలను అక్టోబర్లో జీఐఎస్‌ఏఐడీకి కేంద్రం అందజేసింది. 

అయితే రాష్ట్రంలో బయటపడిన రెండు ఏవై.4.2 victims వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారికి పూర్తిగా నయమయిందా? ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలు ఏమిటి అన్న విషయాలపై స్పష్టత లేదు.

డెల్టా కంటే 12.4 శాతం వృద్ధి
డెల్టా వేరియంట్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం విధితమే. తెలంగాణాలోనూ సెకండ్ వేవ్ లో  Delta variant‌ తో  వేలాది మంది  కరోనా బారిన పడగా,వందలాది మంది చనిపోయారు.  కాగా డెల్టా వేరియంట్లో 3 ఉపవర్గాలను ఉన్నాయి.  వాటిలో 67 రకాల  Strains ఉన్నాయి.  అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో మిగతా వాటితో పోలిస్తే అదనంగా రెండు మ్యుటేషన్లు  ఉన్నాయి.

A222V, Y145H  Mutations వుండటమే దీనికి, డెల్టా వేరియంట్ కు ప్రధానమైన తేడాగా చెబుతున్నారు.  ఇక AY.4.2  డెల్టా వేరియంట్ వైరస్ తో పోలిస్తే, 12.4  శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించారు.  కేసులు మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా.. డబ్ల్యుహెచ్వో మాత్రం కేసులు పెరుగుతున్నాయి, కానీ మరణాలు పెద్దగా లేవని చెబుతుండడం కొంత ఊరట నిస్తుంది.

బెంగళూరులో డెల్టా సబ్ వేరియంట్ కేసులు.. కొత్తరకం కరోనాపై రాష్ట్రంలో ఆందోళనలు

అప్రమత్తంగా ఉండాల్సిందే…

వాస్తవానికి ఏవై.4.2 కేసులు కొన్నింటిని  జూలైలోనే మనదేశంలో గుర్తించారని,,  కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదని నిపుణులు అంటున్నారు. అయితే ఏవై. 4.2  కేసులు ఇంకా తెలంగాణలో ఎన్ని ఉండొచ్చనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఏమైనా ప్రపంచవ్యాప్తంగా Corona cases పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏమరుపాటు తగదనీ స్పష్టం చేసింది. 

బెంగళూరులోనూ...

ఇదిలా ఉండగా.. బెంగళూరులోనూ కరోనా మహమ్మారి సరికొత్త ఉత్పరివర్తనాలతో Coronavirus కొత్త రూపాన్ని ప్రదర్శిస్తూ భయకంపితులను చేస్తున్నది. కరోనా ఇప్పుడు డెల్టా వేరియంట్ రూపంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని చెబుతున్న డెల్టా సబ్ వేరియంట్(ఏవై.4.2) ఇప్పుడు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నది. 

తాజాగా ఒకే రోజు Bengaluruలో మూడు ఈ రకం కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే Karnatakaలో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ కొత్త Delta Subvariantపై ఆందోళనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డీ రందీప్ తాజాగా విలేకరులతో ఈ విషయంపై మాట్లాడారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు డెల్టా AY.4.2 వేరియంట్ కేసులున్నాయని వెల్లడించారు. ఇందులో మూడు కేవలం బెంగళూరు నగరంలోనే ఉన్నాయని తెలిపారు. మిగతా నాలుగు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఇప్పటికీ కట్టడి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.

click me!