దుబ్బాక బైపోల్: చేగుంటలో తమ్ముడి ఓటేసిన అన్న

By narsimha lodeFirst Published Nov 3, 2020, 12:43 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేగుంటలో ఓ వ్యక్తి పట్టుబట్టి టెండర్ ఓటు దాఖలు చేశాడు. తనకు బదులుగా తన సోదరుడు ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఆయన టెండర్ ఓటును వినియోగించుకొన్నాడు.
 

దుబ్బాక: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేగుంటలో ఓ వ్యక్తి పట్టుబట్టి టెండర్ ఓటు దాఖలు చేశాడు. తనకు బదులుగా తన సోదరుడు ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఆయన టెండర్ ఓటును వినియోగించుకొన్నాడు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మంగళవారం నాడు పోలింగ్ జరుగుతుంది.చేగుంటలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ లోని 851 సీరియల్ నెంబర్  ప్రకారంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్లిన వ్యక్తికి షాక్ తగిలింది.

తన ఓటును ఎవరో వేసి వెళ్లిపోయారని పోలింగ్ అధికారి చెప్పారు. తనకు ఓటు హక్కును కల్పించాలని ఆయన ప్రిసైడింగ్ అధికారిని కోరాడు. పక్క బూత్ లో తన సోదరుడి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఆయన పొరపాటున తాను ఓటు వేయాల్సిన పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకొన్నాడని బాధితుడు తెలిపాడు.

also read:చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ప్రచారం: డీజీపీకి ఉత్తమ్‌ ఫిర్యాదు

పోలింగ్ ఏజంట్లు తెలిసి కూడ ఈ విషయమై పట్టించుకోలేదని బాధితుడు విమర్శించాడు.ఈ విషయమై ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగాడు. దీంతో ఆయనను టెండర్ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించాడు.

అప్పుడే అదే పోలింగ్ స్టేషన్ కు వచ్చిన కలెక్టర్ కు బాధితుడు పిర్యాదు చేశాడు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ఆయన కోరాడు.
 

click me!