అదంతా తప్పుడు ప్రచారం: చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై వదంతులను ఖండించిన ఉత్తమ్

By narsimha lodeFirst Published Nov 3, 2020, 10:28 AM IST
Highlights

ఉప ఎన్నికల సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు ముత్యం రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగడం ఆ పార్టీ క్యాడర్ ను గందరగోళంలో ముంచెత్తింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు ముత్యం రెడ్డి తొగుట పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: ఉప ఎన్నికల సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు ముత్యం రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగడం ఆ పార్టీ క్యాడర్ ను గందరగోళంలో ముంచెత్తింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు ముత్యం రెడ్డి తొగుట పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు.

పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది.ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. తప్పుడు ప్రచారం సాగుతోందని ఆ పార్టీ నేతలు గుర్తించారు.

also read:వెన్నుపోటుకు హరీష్, రఘునందన్ కుట్ర: రేవంత్ రెడ్డి సంచలనం

విషయం తెలిసిన వెంటనే పార్టీ మారుతున్నానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని  చెరుకు శ్రీనివాస్ రెడ్డి తొగుట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ స్పందించారు. శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారనేది తప్పుడు వార్త అని ఆయన స్పష్టం చేశారు. 

హరీష్ రావు, రఘునందన్ రావు వారి బంధువుల చేసిన కుట్రగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ క్యాడర్ ను కోరారు.ఎన్నికను ప్రభావితం చేసే కుట్రలో భాగంగా టీఆర్ఎస్, బీజేపీలు ఈ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

click me!