ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో సాక్షుల వాంగ్మూలం నమోదు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 07:00 PM IST
ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో సాక్షుల వాంగ్మూలం నమోదు

సారాంశం

ఓటుకు నోటు కేసులో సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మాగంటి గోపీనాథ్ అప్పటి గన్‌మెన్ వాంగ్మూలాలను మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మాగంటి గోపీనాథ్ అప్పటి గన్‌మెన్ వాంగ్మూలాలను మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నమోదు చేసింది. ఈ కేసు నమోదైన సమయంలో సండ్ర వెంకట వీరయ్య గన్‌మెన్‌గా ఉన్న పి.లచ్చు, మాగంటి గోపినాథ్ గన్‌మెన్‌ జి.సోములు ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఈ ఇద్దరు గన్‌మెన్‌లను రేపు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. నిందితుల్లో సెబాస్టియన్, ఉదయ్ సింహా మంగవారం విచారణకు హాజరయ్యారు.  

Also Read:ఓటుకునోటు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ భూ ఆక్రమణ... ఆలస్యంగా వెలుగులోకి...

కాగా, ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏ పై ఏసీబీ( అవినీతి నిరోదక శాఖ) ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు  సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !