ఇంద్రవెల్లి సభతో ఆదివాసీలు, పోడు భూములు గుర్తొచ్చాయా: కేసీఆర్‌పై సీతక్క ఫైర్

By Siva KodatiFirst Published Aug 10, 2021, 4:42 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు.

టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె... టీఆర్ఎస్ నాయకులకు ఏదైనా పార్టీ సభ పెడితేనో, ఉప ఎన్నికలు వస్తేనో ప్రజలు సమస్యలు గుర్తుకు రావంటూ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ధ్వజమెత్తారు.

Also Read:పూటకో మాట, రోజుకో పార్టీ: రేవంత్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి

గడిచిన ఏడేళ్లుగా  పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని సీతక్క గుర్తుచేశారు. అసెంబ్లీలో , ఎన్నికల ప్రచారాల్లో కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, కానీ నేటి వరకు అతిగతి లేదంటూ ఆమె మండిపడ్డారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. విపక్షాల సభలు జరుగుతుంటే దానిని అడ్డుకోవాలని చూడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని ఆమె హితవు పలికారు. తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ, నిలదీసే ధైర్యం లేదని సీతక్క ధ్వజమెత్తారు. 
 

click me!