ఉత్తమ్ పై ఫైర్: అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టిన మర్రి శశిధర్ రెడ్డి

By Nagaraju TFirst Published Nov 17, 2018, 4:14 PM IST
Highlights

సనత్ నగర్ టిక్కెట్ తనకు రాకుండా పెద్ద కుట్ర జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. తాను గెలవనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్క్రీనింగ్ కమిటీ దగ్గర చెప్పడం బాధాకరమన్నారు. మూడో జాబితాలో తన పేరులేకపోడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మర్రిశశిధర్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: సనత్ నగర్ టిక్కెట్ తనకు రాకుండా పెద్ద కుట్ర జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. తాను గెలవనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్క్రీనింగ్ కమిటీ దగ్గర చెప్పడం బాధాకరమన్నారు. మూడో జాబితాలో తన పేరులేకపోడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మర్రిశశిధర్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తనను తప్పించేందుకు ఉత్తమ్ సర్వేలను కారణంగా చూపించారని ఆరోపించారు. మర్రి శశిధర్ రెడ్డి గెలుపు గుర్రం అంటూ సర్వేలు చెప్తుంటే తాను ఓడిపోతానని అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారన్నారు. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ దగ్గర తాను ఓడిపోతానని ఉత్తమ్ చెప్పడం బాధాకరమన్నారు. 

టీడీపీ ముఖ్య నేతలు సైతం సనత్ నగర్ టిక్కెట్ తాము ఆశించడం లేదని చెప్పారని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని పట్టుబట్టిన కాంగ్రెస్ నేతలు కావాలనే సనత్ నగర్ ను టీడీపీకి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

తనకు టిక్కెట్ దక్కపోవడంపై ఢిల్లీలోని రాహుల్ గాంధీ కార్యాలయానికి కూడా ఫోన్ చేసినట్లు తెలిపారు. పార్టీ పునరాలోచించాలని సూచించినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం లోగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకోకపోతే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు.   

నాకు ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్న ఆలోచన ఆతృత తనకు లేదని మర్రిశశిధర్ రెడ్డి తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. నాపై కొందరు కుట్ర చేశారన్నారు. అయితే పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యబోనన్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

మర్రి శశిధర్ రెడ్డికి ఎసరు పెట్టింది చంద్రబాబే?

కాంగ్రెస్ లో సీట్ల లొల్లి: పార్టీ మారే యోచనలో మర్రి శశిధర్ రెడ్డి...?

మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

 

click me!