ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ కుటుంబం.. వీడియో వైరల్...

Published : Nov 30, 2021, 09:24 AM IST
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ కుటుంబం.. వీడియో వైరల్...

సారాంశం

వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఎక్కడికో వెల్తున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఆర్ టీసీ బస్సును ఎన్నుకున్నారు. బంధు మిత్రులు, కుటుం సభ్యులతో కలిసి ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇక బస్సులో మ్యూజిక్ ప్లే అవుతుండగా.. అందరూ చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్ కూడా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి VC Sajjanar ఆర్టీసీ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. RTC Travel ఎంతో సురక్షితం అని తెలియజేయడానికి ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈ క్రమంలో తాజాగా సజ్జనార్ కు సంబంధించి మరో వీడియో Social mediaలో వైరల్ అవుతోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. దీనిలో సజ్జనార్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ వివరాల్లోకి వెడితే...

వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఎక్కడికో వెల్తున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఆర్ టీసీ బస్సును ఎన్నుకున్నారు. బంధు మిత్రులు, కుటుం సభ్యులతో కలిసి ఇలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇక బస్సులో మ్యూజిక్ ప్లే అవుతుండగా.. అందరూ చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్ కూడా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ viral అవుతోంది. 

ఇది చూసిన నెటిజనుల.. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా మీరు ఆస్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు గ్రేట్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. 

జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ 2/3 తగ్గింపు

ఇదిలా ఉండగా,  భీమ్లా నాయక్ లో తన గానం వినిపించి మరింత ప్రాచుర్యం పొందిన kinnera mogulaiahకు సజ్జనార్ నవంబర్ 25న బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడినప్పటి నుంచి మొగులయ్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కిన్నెర మొగులయ్య మరోసారి తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈసారి సినిమా కోసం ఆయన పాట పాడలేదు.. Telangana RTC సేవలను కిన్నెరతో పాట రూపంలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మొగులయ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ పాట అందుకున్నారు. అది బస్సు కాదు..తల్లిలాంటిదని..శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించారు. కిన్నెర వాయిస్తూ పాడిన ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. 

ఆర్టీసీ బస్సులోన ప్రయాణం ఆనందకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఈ పాట ద్వారా మొగులయ్య సందేశం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇది కాస్తా సజ్జనార్ దృష్టికి రావడంతో.. ఆయన ఫుల్ ఖుష్ అయ్యారు. 

ఈ క్రమంలోనే మొగులయ్యను bus bhavanలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్‌ కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే