చేతకాని దద్దమ్మ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్

By narsimha lode  |  First Published Nov 29, 2021, 7:25 PM IST

వరి ధాన్యం కొనుగోలు విషయమై  కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం విమర్శలు గుప్పించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్  మీడియా సమావేశంలో మాట్లాడారు.



హైదరాబాద్: Paddy ధాన్యం కొనం, కొనలేమంటూ కేంద్రం తన సామాజిక బాధ్యతను వదిలేసిందని కేసీఆర్ విమర్శించారుసోమవారం నాడు Telangana Cabinet ముగిసిన తర్వాత సీఎం Kcr ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీరు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ చిల్లరకొట్టు షావుకారుగా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.. దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళపరుస్తుందన్నారు. ఇంత దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వానికి తాను ఇంతవరకు చూడలేదన్నారు.  ఏపీ ప్రభుత్వం సతాయించినా,  విపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టినా కూడా ప్రాజెక్టులు నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్తే కేంద్రం స్పందించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని నిండా ముంచుతుందన్నారు.  దేశంలో 750 మంది రైతుల్ని పొట్టనబెట్టున్న హంతక పార్టీ బీజేపీ అని కేసీఆర్ ఆరోపించారు. వానాకాలం ధాన్యానికే దిక్కులేదన్నారు.

also read:ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పినట్టు నిరూపించాలి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

Latest Videos

undefined

రా రైస్ ఎంత తీసుకొంటారో కూడా ఇంత వరకు చెప్పలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్తే కేంద్రం స్పందించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని నిండా ముంచుతుందన్నారు.  దేశంలో 750 మంది రైతుల్ని పొట్టనబెట్టున్న హంతక పార్టీ బీజేపీ అని కేసీఆర్ ఆరోపించారు. వానాకాలం ధాన్యానికే దిక్కులేదన్నారు. రా రైస్ ఎంత తీసుకొంటారో కూడా ఇంత వరకు చెప్పలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతు బంధువులమని, బీజేపీ రైతు రాబంధు అంటూ కేసీఆర్ విమర్శించారు.బీజేపీ పాలన కంటే కోటిరెట్లు అన్ని రంగాల్లో తమ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేసీఆర్ చెప్పారు. దేశంలో రైతులు  బాగు పడాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ నొక్కి చెప్పారు. మంచి చట్టాలైతే మూడు సాగు చట్టాలను  ఎందుకు రద్దు చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.  రైతులకు ఎందుకు ప్రధాని క్షమాపణ చెప్పాడన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రైతులకు కూడా కేంద్రం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. దేశంలో మత విభజన రాజకీయాలు తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేస్తారని కేసీఆర్ విమర్శించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్

 రాష్ట్రం నుండి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి Kishan Reddyపై కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో  బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు చేసే విషయమై ఒప్పించాలన్నారు. కానీ ధాన్యం కొనుగోలు చేయబోమని  కిషన్ రెడ్డి చెప్పడంపై ఆయన మండిపడ్డారు.  రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై. కేంద్రంతో పోరాటం చేసేలా సిపాయిగా  కిషన్ రెడ్డి ఉండాలన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే యాసంగిలో బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయించాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్రంపై ఒత్తిడి తేకుండా చేతకాని దద్దమ్మలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని  కేసీఆర్  విమర్శించారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్ కేంద్రమంత్రిపై మండిపడ్డారు.  గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన స్థానం 101లో ఉంటే పాకిస్తాన్ స్థానం 92, బంగ్లాదేశ్, నేపాల్ 76  స్థానాల్లో ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఈ ర్యాంకులను చూసైనా కేంద్ర మంత్రులు కళ్ళు తెరవాలని పరుష పదజాలాన్ని కేసీఆర్ ఉపయోగించారు.  తెలంగాణ రైతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో  చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం నుండి ఎంత వరి ధాన్యం కొనుగోలు చేస్తారో కేంద్రం నుండి టార్గెట్ తీసుకురావాలని ఆయన కిషన్ రెడ్డిని కోరారు.   వర్షాకాలంలో కేంద్రం 40 లక్షలను కేంద్రం టార్గెట్ ఇచ్చిందన్నారు. కానీ రాష్ట్రం నుండి  90 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.జ వర్షాకాల ధాన్యాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేదా బీజేపీ కార్యాలయంలోనో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పారబోసి కేంద్రం వైఖరిని ఎండగడుతామని  ఆయన విమర్శించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.  ఏ చౌరస్తా వద్దకు  వస్తారో రావాలని  కేసీఆర్ కోరారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. హుజూరాబాద్ లో విజయం సాధిస్తే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు  విజయం సాధించామన్నారు. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.  కేసీఆర్  గాలిలో కిషన్ రెడ్డి కూడా ఓటమి పాలు కాలేదా అని ఆయన ప్రశ్నించారు. 

కరెంట్ పై పెత్తనం కోసం కేంద్రం ఆరాటం

కరెంట్ పై పెత్తనం తీసుకొనేందుకు  కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి నుండి తనకు లేఖ వచ్చిందన్నారు. తనతో సమావేశం కోసం కేంద్ర మంత్రి లేఖ వచ్చిందని ఆయన తెలిపారు. విద్యుత్ సంస్కరణలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని  కేంద్ర మంత్రి లేఖ రాశాడన్నారు. బోర్లకు మీటర్లు పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తోందన్నారు. తమ మెడపై కత్తి పెట్టి విద్యుత్ సంస్కరణలను తీసుకురావాలన్నారు. ఈ సంస్కరణలు అమలు చేయకపోతే  కేంద్రం నుండి  తమకు  రావాల్సిన  ఆదాయం ఇవ్వబోమని బెదిరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఇవాళ కూడా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయమై తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలుకు  ముందుకు రాకపోవడంతో తాము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని ఆయన తేల్చి చెప్పారు.  

మరణించిన రైతులకు రూ. 22 కోట్లు 

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు 750 మంది మరణించారన్నారు. అయితే ఈ రైతుల కుటుంబాలకు తాము గతంలో ప్రకటించినట్టుగానే రూ. 3 లక్షలను తెలంగాణ కేబినెట్ మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు రూ. 22 కోట్లను రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఈ నిధులకు కేబినెట్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు.  మరో వైపు  కేంద్ర ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు .పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

 

click me!