షాక్: వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ రివ్యూ పిటిషన్ కొట్టివేత

Published : Sep 13, 2021, 03:14 PM ISTUpdated : Sep 13, 2021, 03:38 PM IST
షాక్: వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ రివ్యూ పిటిషన్ కొట్టివేత

సారాంశం

గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తమ ఆదేశాలను యధావిధిగా కొనసాగించాలని  ఆదేశించింది.  


హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను యధాతథంగా అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్ సర్కార్ దాఖలు చేసిన  రివ్యూ పిటిషన్ ను సోమవారం నాడు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

 

 

 హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేస్తామని తెలంగాణ  హైకోర్టు తెలిపింది.

వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

also read:వినాయక నిమజ్జనం : మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళమే... హైదరాబాద్ స్తంభిస్తుంది..

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను  పాటించలేదని  ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu